వందేళ్లుగా మాతృ భూమి సేవలో ఆర్‌ఎస్‌ఎస్
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:14 AM
వందేళ్లుగా మృభూమి కోసం ఆర్‌ఎస్‌ఎస్ సేవ చేస్తున్నదని దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణ్‌రావు అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్‌లో స్వయం సేవకుల పథ సంచలన్ నిర్వహించారు
భగత్‌నగర్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): వందేళ్లుగా మృభూమి కోసం ఆర్‌ఎస్‌ఎస్ సేవ చేస్తున్నదని దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణ్‌రావు అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కరీంనగర్‌లో స్వయం సేవకుల పథ సంచలన్ నిర్వహించారు. అనంతరం శ్రీచైతన్య జూనియర్ కళాశాల మైదానంలో సంచలన్ సమారోప్ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ దేశ సమస్యలకు మన సమాజంలో ఉన్న అనైక్యతే ప్రధాన కారణమన్నారు. ఆ దిశలోనే జాతిని సంఘటితం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. సంఘ్ ప్రారంభం నుంచి హిందూ సమాజానికి అవసరమైన ప్రతి విషయంలో పని చేస్తూ వస్తుందన్నారు. హిందుత్వాన్ని మత కోణంలో, రాజకీయ కోణంలో ఆలోచించినంత వరకు ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోలేమన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ స్కూల్స్ అధినేత దాసరి శ్రీపాల్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత కార్యకారిణి సభ్యులు బూర్ల దక్షిణామూర్తి, నగర సంఘ చాలక్ హనుమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి, చామ మహేశ్వర్ పాల్గొన్నారు.
ఫ పథ సంచలన్‌లో కేంద్ర హోం శాఖ సహామ మంత్రి బండి సంజయ్‌కుమార్
రాష్ట్రీయ్ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లో పథ సంచలన్ చేపట్టారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ రోడ్‌లోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుంచి కరీంనగర్‌లో పలు ప్రాంతాల మీదుగా రాంనగర్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫాంతో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమారోప్ సమావేశంలో పాల్గొన్నారు.