Share News

ఆరు సంవత్సరాల్లో రూ. 20 వేల కోట్ల పనులు

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:11 AM

ఆరు సంవత్సరాల్లో కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలో 20 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్టు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో వేసిన సీసీ రోడ్లను ఎమ్యెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఆరు సంవత్సరాల్లో రూ. 20 వేల కోట్ల పనులు

వీణవంక, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఆరు సంవత్సరాల్లో కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలో 20 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్టు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో వేసిన సీసీ రోడ్లను ఎమ్యెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి సడక్‌ యోజన, సీఆర్‌ఐఎఫ్‌ నిధులతోపాటు ఇతర నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని నంబర్‌వన్‌గా చేయడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంటు కన్వీనర్‌ బోయినపల్లి ప్రవీణ్‌రావు, మండల అధ్యక్షుడు బత్తిని నరేష్‌గౌడ్‌, నాయకులు పెద్ది మాల్లారెడ్డి, మారముళ్ల కొంరయ్య, ఆదిరెడ్డి, ఎనగంటి శ్రీనివాస్‌, పుప్పాల రఘు, నర్సింహరాజు, సమ్మిరెడ్డి, భాస్కర్‌ పాల్గొన్నారు.

ఫ జమ్మికుంట రూరల్‌: ఎన్నికల సమయంలోనే పార్టీలని తర్వాత పార్టీలకతీతంగా అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటామని కరీంనగర్‌ ఎంపీ కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. జమ్మికుంట మండలం గండ్రపల్లిలో ఎమ్యెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి కేంద్ర సహయ మంత్రి 78 లక్షల విలువ గల పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:12 AM