Share News

రైస్‌మిల్లర్లు ఎలాంటి కోతలు విధించవద్దు

ABN , Publish Date - May 11 , 2025 | 12:29 AM

కొనుగోలు కేం ద్రాల నుంచి వచ్చే రైతుల ధాన్యంలో రైస్‌ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించవద్దని, లారీల కొరత వల్ల అకాల వర్షాలకు దాన్యం తడిస్తే లారీల కాంట్రాక్టర్‌దే బాధ్యత అని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు.

రైస్‌మిల్లర్లు ఎలాంటి కోతలు విధించవద్దు

కోనరావుపేట/చందుర్తి, మే 10 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేం ద్రాల నుంచి వచ్చే రైతుల ధాన్యంలో రైస్‌ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించవద్దని, లారీల కొరత వల్ల అకాల వర్షాలకు దాన్యం తడిస్తే లారీల కాంట్రాక్టర్‌దే బాధ్యత అని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట, గోవిందరా వుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, నిమ్మపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా శనివారం తనిఖీ చేశారు. అలాగే చందుర్తి మండల కేంద్రం, మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల గ్రామా ల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కొనుగోలుకేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం కొనుగో ళ్ల తీరును అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ లారీ కాంట్రాక్టర్‌లు ప్రతి సెంటర్‌కు లారీలను సకాలంలో ఏ ర్పాటుచేయాలని, కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు అకాల వర్షాలకు తడవకుండా తరలించాలని సూచించారు. కొనుగోలు కేం ద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తిచేయాలని, రైతుల బ్యాంక్‌ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరిం చిన ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత లేదని స్పష్టంచేశారు. ఏపీఎంలు కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వెంట డీఆర్డీవో శేషాద్రి, ఐకేపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:29 AM