రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టాలి..
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:15 AM
జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు గుంటి వేణు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబర్ 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు గుంటి వేణు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టరేట్ ఇన్‌చార్జి ఏవో శ్రీకాంత్‌ను కలిసి రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టి రైతాంగాన్ని ఆదుకునేందుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గుంటి వేణు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లర్లు కొనుగోలు చేస్తున్న ధాన్యం లో ఒక సంచి మీద అదనంగా రెండు నుంచి మూడు కిలోల వరకు, క్వింటాలుకు ఐదు నుంచి ఎనిమిది కిలో ల వరకు తేమ పేరుతో కోతలను విధిస్తూ రైతులను నిలువునా దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రోజుల తరబడి రైతాంగం కష్టం పడుతున్నప్పటికీ తేమ ఉన్నదని చెప్పడంతో ప్రైవేటు వ్యాపారస్థులకు తక్కువ ధరలకే ఽధాన్యాన్ని అమ్ముకుని నష్టపోతున్నారని వాపో యారు. రైస్‌మిల్లర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వా హకులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నా రు. రైస్‌మిల్లులపై విజిలెన్స్ అధికారులు వెంటనే తనిఖీ లు నిర్వహించి అవినీతికి పాల్పడుతున్న రైస్‌మిల్లర్లపై కఠిన చర్యల్లో భాగంగా రైస్‌మిల్లుల రిజిస్త్రేషన్‌లను రద్దు చేసి కేసులు నమోదు చేయాలని కోరారు. ప్రతి సీజన్‌లో వేల కోట్ల రూపాయలను రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారని, కొన్ని రైస్ మిల్లులయితే ఏకంగా బహిరంగంగానే క్వింటాలుకు ఎనిమిది కిలోలు తక్కువ కాకుండా ఆఽధారంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీ సంచులు తిరిగి ఇవ్వకుండా కోట్లలో సొమ్ము చేసుకుంటున్న రైస్‌మిల్లులపై కలెక్టర్ తనిఖీ లు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీసంచులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఐకేపీ, సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌక ర్యాలు కల్పించి రైతులు వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తగినన్ని టార్పాలిన్ కవర్ లను రైతులకు అందించాలన్నారు. గతసీజన్ లో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లించాల్సిన రూ500 బోనస్‌తో కలుపుకుంటే నాలుగు కోట్ల 50లక్షలు రైతాంగానికి బోనస్ చెల్లించకపోవడం రైతాంగానికి నిరాశ కలిగించిందన్నారు. డబ్బులను రైతు ల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సోమ నాగరాజు, నాయకులు మంత్రి చంద్ర న్న, రాజేందర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.