Share News

వరికోతలు తాత్కాలికంగా నిలిపివేయాలి

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:24 PM

తుఫాన్‌తో వర్షాలు కురుస్తున్నందున రైతులందరు కోతలను తాత్కాలికంగా నిలిపివేయా లని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ కోరారు.

వరికోతలు తాత్కాలికంగా నిలిపివేయాలి

సిరిసిల్ల రూరల్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : తుఫాన్‌తో వర్షాలు కురుస్తున్నందున రైతులందరు కోతలను తాత్కాలికంగా నిలిపివేయా లని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ కోరారు. సిరిసిల్ల అర్బన్‌ పరి ధిలోని ముష్టిపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ కొనుగోలు కేంద్రాంలో ఉన్న ధాన్యంలో తేమ శాతా న్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం వచ్చింది... ఎంత కొనుగోలు చేశారని నిర్వాహకులను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ మాట్లాడుతూ జిల్లాలోని పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రా ల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్‌లు, నీటి వసతులతో పాటు విద్యుత్‌ కనెక్షన్‌లను కల్పించాల న్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా చెత్తచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన తేమ శాతం 17కు వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. వర్షాల నేఫథ్యంలో ఇంకా వరి కోతులు మొద లు పెట్టని రైతులు తుఫాన్‌ వర్షాలు తగ్గేవరకు వాయిదా వేసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, సిరిసిల్ల తహసీల్దార్‌ మహేష్‌ కుమార్‌, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీబేగ్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 11:24 PM