రెవెన్యూ సదస్సులను నిర్వహించాలి
ABN , Publish Date - May 28 , 2025 | 12:39 AM
జిల్లాలోని అన్ని మం డలాల్లో జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సు లను నిర్వహించడంతో పాటు అకాల వర్షంతో నష్టపోయిన వివరా లను కలెక్టర్ సేకరించి అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని మం డలాల్లో జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సు లను నిర్వహించడంతో పాటు అకాల వర్షంతో నష్టపోయిన వివరా లను కలెక్టర్ సేకరించి అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం హైదరా బాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్ర మాల అమలులో కలెక్టర్ కీలకపాత్ర పోషించాలని సూచించారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులను కలెక్టర్ నిరంతరం పర్యవేక్ష్షించాలని, ఎక్కడైనా రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల పరిహారం అందిం చేందుకు నివేదిక తయారుచేసి ప్రతిపాదనలు పంపాలని ము ఖ్యమంత్రి తెలిపారు. వర్షాలు ముందుగా రావడం వల్ల వ్యవ సాయ శాఖ తన ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలని, రైతు లకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉం డాలన్నారు. విత్తనాల, ఎరువులు అక్రమస్టాక్ ఉంటే కఠిన చర్య లు తీసుకోవాలని అన్నారు. నకిలి విత్తనాల అమ్మేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. భూభారతి చట్టం ముందస్తు గా నాలుగు పైలెట్ మండలాలను ఎంపిక చేసుకున్నామని, అనంతరం ప్రతి జిల్లాలో ఒక మండలానికి పైలట్‌గా ఎంపిక చేసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ప్రజల నుండి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ ప్రజలను భూతంలా పీడించిందని, భూ భారతి చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుందని సీఎం తెలిపారు. పైలెట్ మండలాలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. వానాకాలం పంట సాగు కోసం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో పెట్టాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో శేషాద్రి, డీఎం సివిల్ సప్లై రజిత డీసీఎస్‌ఓ వసంతలక్ష్మి పీడీ హౌ సింగ్ శంకర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.