Share News

రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి

ABN , Publish Date - May 03 , 2025 | 12:19 AM

భూభారతి చట్టం ప్రకారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధి కారులు చర్యలు తీసుకోవడంతోపాటు ఈనెల 5 నుంచి 20వ తేదీవరకు జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసం బంధాల శాఖ మంతి పొంగులేటి శ్రీనివాస్‌ అధికారులను అదే శించారు.

రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : భూభారతి చట్టం ప్రకారం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధి కారులు చర్యలు తీసుకోవడంతోపాటు ఈనెల 5 నుంచి 20వ తేదీవరకు జిల్లాలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసం బంధాల శాఖ మంతి పొంగులేటి శ్రీనివాస్‌ అధికారులను అదే శించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో భూ భారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ ఈనెల 5నుంచి 20వ తేదీ వరకు పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని జిల్లా కేంద్రాలను మినహాయించి జిల్లాలో ఒక మండ లాన్ని పైలెట్‌గా తీసుకుని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వ హించి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకోవాలన్నా రు. జూన్‌ 2వరకు పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద వచ్చిన దరఖాస్తుల పరి ష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. భూ భారతి చట్టంలో దర ఖాస్తు చేసుకునే సమయంలో సరిగ్గా దరఖాస్తులు నమోదు అయ్యేలా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటుచేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో పొజిష న్‌లో ఉన్న రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పొజిషన్‌లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు సీఎం చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టాలు ఉండి పొజిషన్‌లో లేని దరఖాస్తులు కూడా పరిశీలించాలన్నారు. హై కోర్టు అనుమతులు రాగానే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కారం చేయాలని, దీనికి అవసరమైన కార్యాచరణను పూర్తిచేయాలన్నారు. ఈ నెల చివరికల్లా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తప్పులులేకుండా పరిష్కారం చూపాలన్నారు. గతంలో పంపిణీ చేసిన ప్రభుత్వ భూముల పట్టాలు ఎవరైనా విక్రయిస్తే ముందు ఆ పట్టాల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలన్నారు. కొనుగోలు చేసిన వారు భూమి లేని నిరుపేద అయితే ప్రభుత్వంతో చర్చించి ఎంత భూమి క్రమబద్ధీకరించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అట వీ భూముల వివాదాల పరిష్కారానికి కూడా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్‌ పీఎం ఆవాస్‌ యోజన కింద ఇళ్లు మంజూరయ్యాయని పట్టణ ప్రాంతాల్లో కనీసం 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూడాలన్నారు. పీఎంఎల్‌ఏ పోర్టల్‌లో లబ్ధిదారుల ధ్రువీకరణ ఆధార్‌ నంబర్‌లతో పూర్తిచేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఆర్‌డీవో శేషాద్రి, హౌసింగ్‌ పీడీ శంకర్‌లతో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:19 AM