మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:53 PM
తెలంగాణ ఓటర్లకు మోసపూరిత వాగ్దానాలు చేసి రేవంత్‌రెడ్డి గద్దెనెక్కాడని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఓటర్లకు మోసపూరిత వాగ్దానాలు చేసి రేవంత్‌రెడ్డి గద్దెనెక్కాడని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవనంలో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును వినోద్‌కుమార్, బీఆర్ ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేయలేని తెలిసి కూడా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని పక్కన పెట్టుకొని కాం గ్రెస్ గ్యారెంటీ కార్డులను రేవంత్‌రెడ్డి విడుదల చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి అయినా హామీలను అమ లుచేయకపోవడంతో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులోని పథకాల హామీల ను ప్రజలు ప్రశ్నించాలని బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసిందన్నారు. బాకీపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అడ గాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డుల ను ఇవ్వాలన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారం లోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని మర్చి ఢిల్లీకి సంచులు మోస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు ఎల్లకాలం మోసపోరని ప్రజలు సన్నద్ధమై ఉన్నారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దీటైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోకపోవడంతో గ్రామాల్లో ప్రజల వద్ద కు వెళ్లి ఓట్లు అడిగే సాహసాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త లు చేయని పరిస్థితి దాపురించిందన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్నిక లు వాయిదాపడ్డా కాంగ్రెస్ బాకీ కార్డుల కార్యక్రమం వాయిదా పడద న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ చి క్కాల రామారావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్‌ఎస్ వేము లవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు,జడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణా, మాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, ము న్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, ఏనుగు మనోహర్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.