Share News

విద్యుత్‌ ప్రజావాణికి స్పందన

ABN , Publish Date - May 13 , 2025 | 11:43 PM

విద్యుత్‌ ప్రజావాణికి మంచి స్పందన లభిస్తోందని టీజీఎన్పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ సూపెరింటెండింగ్‌ ఇంజనీర్‌ రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు విద్యుత్‌ ప్రజావాణిలో 1128 ఫిర్యాదులు రాగా 1038 సమస్యలు పరిష్కరించామన్నారు. జూన్‌ 17, 2024న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

విద్యుత్‌ ప్రజావాణికి స్పందన

గణేశ్‌నగర్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ప్రజావాణికి మంచి స్పందన లభిస్తోందని టీజీఎన్పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ సూపెరింటెండింగ్‌ ఇంజనీర్‌ రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు విద్యుత్‌ ప్రజావాణిలో 1128 ఫిర్యాదులు రాగా 1038 సమస్యలు పరిష్కరించామన్నారు. జూన్‌ 17, 2024న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విద్యుత్‌ బిల్లుల సమస్యలు, మీటర్ల సమస్యలు, విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు, కేటగిరీ మార్పు, పేరు మార్పు తదితర ఫిర్యాదులను సమస్య తీవ్రతను బట్టి అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నామన్నారు. సర్కిల్‌ పరిధిలోని డివిజన్‌ ఆఫీస్‌, ఈఆర్వో, సబ్‌ డివిజన్‌ ఆఫీస్‌, సెక్షన్‌ ఆఫీస్‌లో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి ఒంటి గంటవరకు, సర్కిల్‌ ఆఫీస్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపారు. విద్యుత్‌ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై సమీక్షలు నిర్వహించి వినియోగదారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Updated Date - May 13 , 2025 | 11:44 PM