Share News

జిల్లాస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు స్పందన

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:05 AM

జిల్లాస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు విశేష స్పందన లభించింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 160 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

జిల్లాస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు స్పందన
షాట్‌పుట్‌ వేస్తున్న క్రీడాకారుడు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు విశేష స్పందన లభించింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 160 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను రామగుండం అడిషనల్‌ సీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసిక అభివృద్ధి, శారరక పటిష్టం పెంపొందుతుందన్నారు. అనంతరం 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయస్సులోపు మహిళలు, పురుషులకు వివిధ వయస్సుల వారీగా వాకింగ్‌, రన్నింగ్‌, త్రోస్‌, జంపింగ్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను డిసెంబరు 13, 14 తేదీల్లో కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలనుమాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ చాట్ల శ్రీధర్‌, నీలం లక్ష్మణ్‌ పర్యవేక్షించారు. కార్యక్రమంలో దుగ్గు మహేందర్‌, రాకేష్‌, పి కిషన్‌రావు, వి లక్ష్మీనారాయణ, వి వెంకటేశ్‌, జె శిరీష, అమరేందర్‌, రమేష్‌ రెడ్డి, కన్నం శ్రీనివాస్‌, రమణారెడ్డి, రాధమ్మ, పద్మ పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:05 AM