Share News

జిల్లా స్థాయి యోగా పోటీలకు స్పందన

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:04 AM

యోగా జిల్లా అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలలోని శ్రీ సత్యసాయి సేవా మందిరం ఆవరణలో జిల్లా స్థాయి యోగా(సీనియర్స్‌) పోటీలను నిర్వహించారు.

జిల్లా స్థాయి యోగా పోటీలకు స్పందన

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : యోగా జిల్లా అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలలోని శ్రీ సత్యసాయి సేవా మందిరం ఆవరణలో జిల్లా స్థాయి యోగా(సీనియర్స్‌) పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెడల్స్‌తోపాటు మెరిట్‌ సర్టిఫికెట్లను యోగా జిల్లా అసోసియేషన్‌ సభ్యులు అందించి అభినందించారు. ఈసందర్భంగా యోగా జిల్లా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌ మాట్లాడారు. జిల్లా స్థాయి యోగా పోటీలు 18నుంచి 45ఏళ్లలోపు క్రీడాకారుల మధ్య వివిధ విభాగాల్లో పోటీలు జరిగాయన్నా రు. పోటీలలో విజేతలైన క్రీడాకారులను సెప్టెంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల కు జిల్లా నుంచి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్‌ సభ్యు లు, శిక్షకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 01:04 AM