Share News

జిల్లాస్థాయి సైక్లింగ్‌ ఎంపిక పోటీలకు స్పందన

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:50 PM

జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో జిల్లాస్థాయి సైక్లింగ్‌ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

జిల్లాస్థాయి సైక్లింగ్‌ ఎంపిక పోటీలకు స్పందన
జెండా ఊపి జిల్లాస్థాయి సైక్లింగ్‌ పోటీలను ప్రారంభిస్తున్న కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్‌, తదితరులు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో జిల్లాస్థాయి సైక్లింగ్‌ ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్‌, సైక్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ బి మధుసూదన్‌రెడ్డి, సురభి వేణుగోపాల్‌ జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం అండర్‌-14, 16, 18, 21, ఎబో 21 విభాగాల్లో బాలబాలికలకు పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను నవంబరు 1, 2 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

ఫ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు...

అండర్‌-14 బాలుర విభగంలో ఆశ్రిత్‌ ఖండల్‌, బి సనాతన ప్రసాద్‌, సీహెచ్‌ రోహిత్‌రెడ్డి, ఎ అర్జున్‌, కె అనోజ, టి రిషిక ఎంపికయ్యారు. బాలికల విభాగంలో కె ఆద్యా, ఎస్‌ భవ్య, జె నక్షత్ర, లేఖ్య రామన్‌, రితికాసిరిన్‌, బి శృతి ఎంపికయ్యారు. అండర్‌-16 బాలుర విభాగంలో బి అక్షయ్‌, ఎండీ జేద్‌, కె అనిరుధ్‌, వి నిహార్‌, బి సిద్ధార్థ్‌, పి శ్రేష్ట్‌, పి సాత్విక్‌, అండర్‌-18 బాలుర విభాగంలో వి రితికేష్‌, 21 అండ్‌ ఎబోవ్‌ ఎం రేహాన్‌, శివకృష్ణ ఎంపికయ్యారు.

Updated Date - Oct 26 , 2025 | 11:50 PM