జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలకు స్పందన
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:29 AM
అండర్-19 జూనియర్స్ బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని టీజీఎన్‌పీడీసీఎల్ బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన ఈ పోటీలకు 30 మంది బాలికలు, 35 మంది బాలురు హాజరయ్యారు. వీరికి వేర్వేరుగా పోటీలను నిర్వహించి ప్రతిభచాటిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు.
కరీంనగర్ స్పోర్ట్స్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): అండర్-19 జూనియర్స్ బాస్కెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని టీజీఎన్‌పీడీసీఎల్ బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన ఈ పోటీలకు 30 మంది బాలికలు, 35 మంది బాలురు హాజరయ్యారు. వీరికి వేర్వేరుగా పోటీలను నిర్వహించి ప్రతిభచాటిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు గద్వాల జిల్లా ఉత్తనూరులో జూలై 11, 12, 13 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటాయి. ఈ పోటీల నిర్వహణను బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి అనంతరెడ్డి పర్యవేక్షించారు. కార్యక్రమంలో పీడీలుఉ శ్రీధర్‌రావు, డి సత్యానంద్, సీనియర్ క్రీడాకారులు సునీల్ కుమార్, అరుణ్‌తేజ, అభి, వెంకటేశ్, జీవన్, భార్గవ్, అనిల్, పరిమిత కౌర్, జీవన్‌కుమార్, రాకేష్‌పాల్గొన్నారు.
ఫ జిల్లా బాస్కెట్‌బాల్ జట్లు...
రాష్ట్ర పోటీలకు ఎంపికైన జిల్లా బాలబాలికల జట్లను జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి ప్రకటించారు. బాలుర విభాగంలో భరత్‌రాజు, అక్షిత్‌సాయి, సిద్ధార్థ, రిషి, త్రినేష్, శివమణి, కౌశిక్, అఖిల్, సల్మాన్, స్పృహిత్, ఉమేష్, సాయి విఘ్నేష్ ఎంపికయ్యారు. స్టాండ్ బైస్‌గా సాయితేజ, రాఘవేంద్ర, రిత్విక్, అభినయ్‌ను ఎంపిక చేశారు.
- బాలికల విభాగంలో అక్షయ, ముగ్ధ హాసిని, భద్ర బిబేష్, త్రయ, మీనాక్షి, సుహాక్షి, సహస్ర, మృనాలి, అశ్విక, జస్లీన్, షాన్వి, అక్షిత ఎంపికయ్యారు. స్టాండ్ బైస్‌గా విధాత్రిరెడ్డి, విన్మయి, మాయ, సూర్యమిత్రను ఎంపిక చేశారు.