పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:04 AM
జిల్లాలో గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు అయ్యాయి. జిల్లాలోని 13 మండలాల్లో గ్రామ పంచా యతీల వారీగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష రిజర్వేషన్లు ప్రకటించారు. జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లో ఎస్టీ-6, ఎస్సీ-54, బీసీ-69, జనరల్-134 రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మంథని, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు అధికారికంగా ఖరారు అయ్యాయి. జిల్లాలోని 13 మండలాల్లో గ్రామ పంచా యతీల వారీగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష రిజర్వేషన్లు ప్రకటించారు. జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లో ఎస్టీ-6, ఎస్సీ-54, బీసీ-69, జనరల్-134 రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వీటిలో ఎస్టీ మహిళ-1, జనరల్-2, ఎస్టీ మహిళ-1, జనరల్-2, ఎస్సీ మహిళ-24, ఎస్సీ జనరల్-30, బీసీ మహిళ-30, బీసీ జనరల్-39, జనరల్ మహిళ-65, జనరల్-69 గ్రామ పంచాయతీలను ఖరారు చేశారు. జిల్లాలోని 13 మండలంలోని 263 గ్రామ పంచాయతీల్లో 2432 వార్డుల్లో సైతం వార్డు వారీగా రిజర్వేషన్లు ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా ప్రకటించారు. వీటి కోసం మండలాల వారీగా అధికార యంత్రాంగం రెండు రోజుల పాటు కసరత్తు చేసి ఎట్టకేలకు అధికారి కంగా ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభాను తీసుకోగా, 2014లో చేపట్టిన కులగణన లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు మినహా గ్రామీణ ప్రాంతాల్లో 4,91,651 మంది జనాభా ఉన్నారు. వీరిలో 94,104 మంది ఎస్సీలు, 10,115 మంది ఎస్టీలు ఉన్నారు. సర్పంచ్ స్థానాలకు మండలంలోని జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి మిగితావి జనరల్ స్థానాలకు చూపారు. వార్డు సభ్యుల స్థానాలకు గ్రామ జనాభా ఆధారంగా రిజర్వు చేశారు. ఇందులో 50 శాతం సీట్లు మహిళలకు డ్రా తీసి కేటాయించారు. గ్రామ పంచాయతీల వారీగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్, వివిధ కేటగిరీల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ అధికారికంగా ఖరారు కావడంతో జిల్లాలోని మంథని, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 263 గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఆయా గ్రామ పంచాయతీల్లో తమకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావాహుల్లో ఉత్సహంతో ప్రజలను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో వైపు ఎన్నో నెలలుగా సర్పంచ్ పదవి కోసం కలలు కన్న కొందరు ఆశావాహులకు రిజర్వేషన్లు బెడిసికొట్టడంతో వారు నిరుత్సాహంలో పడ్డారు. ఎట్టకేలకు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ల తంతు పూర్తి కావ డంతో సర్పంచ్, వార్డు మెంబర్ పోటీలో ఉండనున్న ఆశావాహులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి స్థానిక పోరులోకి దూకనున్నారు. జిల్లా అంతా స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది.