Share News

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:43 AM

జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించా లని ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎన్నికల అధికారి గరీమ అగ్రవాల్‌ కోరారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించా లని ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎన్నికల అధికారి గరీమ అగ్రవాల్‌ కోరారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫ రెన్స్‌ హాల్లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమ అగ్రవాల్‌ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు వురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సం దేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. ఇన్‌ చార్జి కలెక్టర్‌, ఎన్నికల అధికారి మాట్లాడారు. ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని స్ప ష్టం చేశారు. కలెక్టరేట్‌ సముదాయంలో కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌లైన్‌, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చే శామని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు నూతన బ్యాంక్‌ ఖాతా ఓపెన్‌ చేయాలని, నామినేషన్‌ పత్రా లు పూర్తిగా నింపాలని, తమ పూర్తి సమాచారాన్ని నింపాలని తెలిపారు. ప్రచార వాహనాల అనుమతి తహసీల్దార్‌, లౌడ్‌స్పీకర్‌,ర్యాలీలకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రతి పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించి వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించా లని పేర్కొన్నారు. నామినేషన్లు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తీసు కుంటారని వెల్లడించారు. ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియాలో ప్రచారానికి సంబంధించి జిల్లా పౌర సంబంధాల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీ వో శేషాద్రి, జడ్పీ డిప్యూటీ సీఈవోఎ గీత, డీపీవో షర్ఫుద్దీన్‌, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, కుంబా ల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:43 AM