Share News

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:15 PM

స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌, ఎన్నికలఅధికారి ఎం హరిత కోరారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

సిరిసిల్ల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌, ఎన్నికలఅధికారి ఎం హరిత కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌పై రాజకీయ పార్టీ ల ప్రతినిధులత్లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భం గా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు.కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిక్క చ్చిగా, పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందన్నా రు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ర్యాలీలు, సభలు, ప్ర చారాలు నిబంధనల ప్రకారం, ఎన్నికల ప్రవర్తనా నియ మావళికి లోబడి నిర్వహించుకోవాలని కోరారు. జిల్లాలో రెండు విడ తల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రెండు, మూడో విడతలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హెల్ప్‌లైన్‌, ఫిర్యాదు ల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షర్ఫుద్దీన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా ఆధ్యక్షుడు తోట ఆగ య్య, తీగల శేఖర్‌గౌడ్‌, రాజన్న, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 11:15 PM