తుఫాన్ నష్టంపై నివేదికలు అందించాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:09 AM
జిల్లాలో తుఫాన్ నష్టంపై సమగ్ర నివేధికలను అధికారులు వెంటనే అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబర్ 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తుఫాన్ నష్టంపై సమగ్ర నివేధికలను అధికారులు వెంటనే అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం తుఫాన్ నష్టంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఇటీవల తుఫాన్ కారణంగా పాకిక్షంగా పూర్తిగా నష్టపోయిన ఇళ్ల వివరాలను రెవెన్యూ అధికారులు, పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు, రోడ్లు, వంతెనలు, కల్వర్టుల నష్టంపై ఆర్‌అండ్‌బీ అధికారులు, స్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లు, ప్రభుత్వ శాఖల భవనాల్లో లీకేజీలపై డీఈవో, డీడబ్య్లూవో, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల లీకేజీ, మరమ్మతుపై నీటి పారుదల శాఖ అధికారులు, విద్యుత్ స్థంభాలు, సబ్‌స్టేషన్లలో నష్టం అంచనా లను సెస్ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి నివేదిక లను మంగళవారంలోగా అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటే శ్వర్లు, వేములవాడ అర్డీవో రాధాబాయి, అర్‌అండ్ బీ ఈఈ నర్సింహా చారీ, డీఏవో అఫ్జల్ బేగం, నీటి పారుదల శాఖ జిల్లా అధికారి కిషోర్ కుమార్, సెస్ ఎండీ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.