Share News

‘గుర్తు’ గుర్తుంచుకో...!

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:03 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్య ర్థులకు గుర్తుల గుబులు పట్టుకున్నది. ఈ ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటు కీలకమే కావడంతో ఓటర్లు గుర్తుంచు కునేలా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు అభ్యర్థులున్న చోట పెద్దగా ఇబ్బంది లేకపోయినా, అంతకు మించి అభ్యర్థులు ఉన్న చోట క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందోమోననే భయం పట్టు కున్నది. సర్పంచ్‌కు ఒకటి, వార్డు సభ్యుడి కోసం మరొక బ్యాలెట్‌ ఉండడం, ఓటర్లు రెండింటిపై ఓట్లు వేయాల్సి రావడంతో గుర్తుల విషయంలో కొంత మంది ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు.

‘గుర్తు’ గుర్తుంచుకో...!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్య ర్థులకు గుర్తుల గుబులు పట్టుకున్నది. ఈ ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటు కీలకమే కావడంతో ఓటర్లు గుర్తుంచు కునేలా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు అభ్యర్థులున్న చోట పెద్దగా ఇబ్బంది లేకపోయినా, అంతకు మించి అభ్యర్థులు ఉన్న చోట క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందోమోననే భయం పట్టు కున్నది. సర్పంచ్‌కు ఒకటి, వార్డు సభ్యుడి కోసం మరొక బ్యాలెట్‌ ఉండడం, ఓటర్లు రెండింటిపై ఓట్లు వేయాల్సి రావడంతో గుర్తుల విషయంలో కొంత మంది ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కొన్ని గుర్తులు ఒకే పోలికతో ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. నిరక్షరాస్యులు, వృద్ధుల ఓట్ల గురించి అభ్యర్థులకు బెంగ పట్టుకున్నది. మన గుర్తుకు అనుకుని మరొకరి గుర్తుకు ఓటు వేస్తే ఫలి తాలు తలకిందులు కావచ్చని భావిస్తున్నారు. మెజారిటీ ఓటర్లకు గుర్తు గట్టిగా గుర్తుండి పోయేలా, ఓటర్లు మరచిపోకుండా గుర్తుంచుకునేలా అభ్యర్థులు ఇంటి ల్లిపాది ప్రచారం చేస్తున్నారు. బ్యాలెట్‌ నమూనా పత్రా లు, డోర్‌పోస్టర్లు, కరపత్రాలతోపాటు బ్యానర్లు కట్టిస్తు న్నారు. కొందరు గ్రామాల్లో వాల్‌ రైటింగ్‌ కూడా చేయి స్తున్నారు. ఆటోలు పెట్టి మైకుల ద్వారా పాటలు పెట్టి గుర్తుల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉంటాయి. కానీ పం చాయతీ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహిస్తుం టారు. బ్యాలెట్లలో వరుస క్రమంలో కేవలం గుర్తులు మాత్రమే ఉంటాయి. అభ్యర్థుల పేర్లు, ఫొటోలు కాన రావు. తాము ఓటు వేయాలనుకున్న అభ్యర్థి గుర్తు పోలింగ్‌ బూతులకు వెళ్లినప్పుడు గుర్తుకు రాకుంటే మాత్రం ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి పడు తుంది. ఫలితంగా అభ్యర్థుల జాతకాలు తలకిం దులయ్యే ప్రమాదం ఉంది. దీంతో అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తు ఓటర్లకు గుర్తుండేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీ తంగా జరుగుతుండడంతో పార్టీ గుర్తులకు బదులు ఇతర గుర్తులను కేటాయిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో సర్పంచ్‌ స్థానానికి 30 గుర్తులు, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులను ప్రకటించింది. వాటిని అక్షరమాలను అనుసరించి అభ్యర్థులకు కేటాయించారు. సర్పంచ్‌ పదవికి గులాబీ రంగు బ్యాలెట్‌, వార్డు సభ్యుడి పదవికి తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాన్ని ఉపయోగిం చనున్నారు.

ఫ ఈ నెల 11న మొదటి విడత పోలింగ్‌..

జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు, 2432 వార్డు స్థానాలు ఉన్నాయి. మొదటి విడతలో మంథని, ముత్తా రం, రామగిరి, కమాన్‌పూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండ లాల్లో 99 పంచాయతీలు, 896 వార్డు స్థానాలు ఉన్నా యి. మంథని మండలంలో మూడు, రామగిరి మం డలంలో ఒక పంచాయతీ సర్పంచ్‌ స్థానం, మొత్తం 211 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 98 పంచా యతీల్లో 95 సర్పంచ్‌ స్థానాలు 685 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రోజుల నుంచి ఆయా గ్రామాల్లో తమకు కేటాయించిన గుర్తుల గురించి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనున్నది. మంగళ వారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం ముగి సింది. కేవలం మౌఖిక ప్రచారం మాత్రమే చేయాల్సి ఉంటుంది. రెండో విడతలో ధర్మారం, పాలకుర్తి, అం తర్గాం, జూలపల్లి మండలాల్లో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మంగళవారం మూడో విడత ఎన్నికలు జరుగుతున్న పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్‌, ఎలిగేడు మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో సదరు అభ్యర్థులు బుధవారం నుంచి గుర్తులతో ప్రచారపర్వం మొదలు పెట్టనున్నారు.

ఫ సోషల్‌ మీడియాలోనూ జోరుగా ప్రచారం...

వ్యక్తిగత ప్రచారంతోపాటు సోషల్‌ మీడియాలోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. హంగూ ఆర్భాటం లేకుండా తమ గ్రామానికి చెందిన ఓటర్లందరికీ తమ గుర్తు చేరేలా వాట్సాప్‌ గ్రూపుల్లో స్టేటస్‌ పోస్టు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. తమకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఫోన్లు చేసి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ గుర్తును ముద్రించిన కరపత్రాలతో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు సమీ పిస్తుండడంతో గ్రామాల్లో ప్రచార హోరు వేగం పుంజు కుంది. ఓటర్ల మనస్సుల్లో గుర్తులు బలంగా నిలిచేలా అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత మేరకు ఈ ఎన్నికల్లో ప్రచార సామగ్రిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ గెలుపు కోసం అనేక తంటాలు పడుతున్నారు. ఓటర్లు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడకుండా గుర్తుల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 01:03 AM