Share News

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:42 PM

స్కాలర్‌షిప్‌, రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ప్రజాభవన్‌ను ముట్టడిస్తామని యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి హెచ్చరించారు. నగర కమిటీ సమావేశం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించారు.

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి
సమావేశంలో మాట్లాడుతూన్నా యుఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి

గణేశ్‌నగర్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్కాలర్‌షిప్‌, రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ప్రజాభవన్‌ను ముట్టడిస్తామని యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి హెచ్చరించారు. నగర కమిటీ సమావేశం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి సంద గణేష్‌ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేని జూనియర్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అనుమతి లేని జూనియర్‌ కళాశాల గుర్తింపు రద్దు చేయాలన్నారు. సమావేశంలో నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బూస మణితేజ, అల్లపు అభిలాష్‌, నాయకులు శాన్విత్‌ ,అఖీరా, నందన్‌ కుమార్‌, వంశీ, మనితేజ, హేమంత్‌, అభిలాష్‌, జీవన్‌, మయూరి, అక్షయ, వాణి, ప్రీతి పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:42 PM