నిబంధనలను పాటించకుంటే రిజిస్ట్రేషన్స్ రద్దు
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:50 AM
జిల్లాలో ప్రభుత్వ నిబంధ నలను పాటించకుంటే ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్స్ రద్దు చేస్తాం అని డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత అన్నారు.
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రభుత్వ నిబంధ నలను పాటించకుంటే ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్స్ రద్దు చేస్తాం అని డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో డీఎంహెచ్‌వో సిబ్బందితో కలిసి తనిఖీలను చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రిసెప్షన్ కౌంటర్ వద్ద ధరల పట్టిక వివారాలు, రిజి స్ట్రేషన్ సర్టిఫికెట్స్, వైద్యులు, సిబ్బంది వివరాలు పెట్టకపోవడంపై ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, వ్యాధిగ్రస్తులకు కనీస వసతులు ఏర్పాటు చేయా లని ఆదేశించారు. డయాగ్నస్టిక్ కేంద్రాలు, ల్యాబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవా లన్నారు. ఆసుపత్రుల రికార్డులు, సరైన మెడికల్ రిపోర్టులు క్రమంగా ఉం చాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు, వైద్యులు ప్రభుత్వ నిబం ధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చ రించారు. వెంట వైద్యులు రామకృష్ణ, మహేష్‌గౌడ్, సిబ్బంది ఉన్నారు.