Share News

వైద్య, ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ

ABN , Publish Date - May 28 , 2025 | 12:34 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యా రోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన భర్తీ చేసేందుకు మంగళవారం ఇంటర్వ్యూలు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధ్యక్ష తన నిర్వహించారు.

వైద్య, ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 27 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైద్యా రోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన భర్తీ చేసేందుకు మంగళవారం ఇంటర్వ్యూలు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధ్యక్ష తన నిర్వహించారు. ఇది వరకే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 4 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు 1 అభ్యర్థి, కాంట్రా క్టు ప్రాతిపదికన 1 ల్యాబ్‌ మేనేజర్‌ పోస్టుకు ఆరుగురు అభ్యర్థులు, 5 ఎంఎల్‌ హెచ్‌పీ పోస్టులకు 11మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. ఈ ఇంటర్వ్యూలలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రజిత, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీనారా యణ పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:34 AM