Share News

రికార్డులు సక్రమంగా నిర్వహించాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:08 AM

పోలీసులు వారికి కేటాయించిన విధులతోపాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం సూచించారు. బుధవారం సీపీ కరీంనగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
రికార్డులను పరిశీలిస్తున్న సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పోలీసులు వారికి కేటాయించిన విధులతోపాటు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం సూచించారు. బుధవారం సీపీ కరీంనగర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. షీ టీం కార్యాలయాన్ని సందర్శించి వారు నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. బాధితులకు అందించే కౌన్సెలింగ్‌ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సీసీటీఎన్‌ఎస్‌లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ పి శ్రీలత, ఎస్‌ఐలు డి మనీషా, సీహెచ్‌ రాజన్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:08 AM