Share News

నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలి

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:36 AM

అలా్ట్రసౌండ్‌ పరీక్షలు చేసే ఆసుపత్రులు నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలి
మందులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ

సుభాష్‌నగర్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అలా్ట్రసౌండ్‌ పరీక్షలు చేసే ఆసుపత్రులు నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఐదు అలా్ట్రసౌండ్‌ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగనిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, ప్రోత్సహించిన, సహకరించిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 50 వేల రూపాయల జరిమానా విధిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా జనరల్‌ ఆసుపత్రిలోని వెల్‌నెస్‌ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అవుట్‌ పేషంట్‌, ఇన్‌ పేషంట్‌ సేవలు, ల్యాబ్‌, ఫార్మసీలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన పెన్షనర్లతో మాట్లాడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంసీహెచ్‌పీవో డాక్టర్‌ సనా జవేరియా, ఎన్‌హెచ్‌ఎం డీపీవో స్వామి, సూపర్‌వైజర్‌ సాబీర్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:36 AM