Share News

నిబద్ధతతో పనిచేసిన వారికి గుర్తింపు..

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:54 AM

నిబద్ధతతో పనిచేసిన ఉపాధ్యాయులకు సమాజంలో గుర్తింపు ఉంటుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

నిబద్ధతతో పనిచేసిన వారికి గుర్తింపు..

ఇల్లంతకుంట, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : నిబద్ధతతో పనిచేసిన ఉపాధ్యాయులకు సమాజంలో గుర్తింపు ఉంటుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కందికట్కూర్‌ గ్రామంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బద్దం రవీందర్‌రెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాగా శనివారం నియోజకవర్గకేంద్ర కార్యాలయంలో సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నేడు వసతులు మెరుగు అయ్యాయన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, కిసాన్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశం రాజేందర్‌రెడ్డి, నాయకులు వెలిశాల జ్యోతి, మామిడి సంజీవ్‌, బొల్లవేని రమేష్‌, నీలం అంజయ్య, ముత్యం అమర్‌, కేతిరెడ్డి నవీన్‌రెడ్డి, శ్రీలతనరేందర్‌రెడ్డి, విజయలక్ష్మిమల్లేశం, యాస తిరుపతి, చిట్టి ప్రదీప్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాగయ్య, వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:54 AM