రాత్రి వరకు కొనసాగిన మద్యం టెండర్ల స్వీకరణ
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:28 AM
జిల్లా కేం ద్రంలోని ఎస్సారె స్పీ క్యాంపులో గల ఎక్సైజ్ సర్కిల్ కా ర్యాలయంలో ని ర్వహిస్తున్న మ ద్యం దుకాణాల టెండరు దరఖా స్తుల స్వీకరణ తుది రోజు శనివా రం రాత్రి వరకు కొనసాగింది
- తుది రోజు టెండరుదారుల కోలాహలం
జగిత్యాల, అక్టో బరు 18 (ఆంధ్ర జ్యోతి): జిల్లా కేం ద్రంలోని ఎస్సారె స్పీ క్యాంపులో గల ఎక్సైజ్ సర్కిల్ కా ర్యాలయంలో ని ర్వహిస్తున్న మ ద్యం దుకాణాల టెండరు దరఖా స్తుల స్వీకరణ తుది రోజు శనివా రం రాత్రి వరకు కొనసాగింది. అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఎక్సైజ్ అధికార వర్గాలు అంటున్నాయి. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ల పరిధిలో 71 మద్యం దుకాణాలకు అధికారులు గెజిట్ నోటిఫి కేషన్ జారీ చేసి టెండరు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒక్కో ఎక్సైజ్ స్టేషన్ కు ఒక్కో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈనెల 17వ తేదీ వరకు 884 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. అయితే తుది రోజు దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో కేంద్రం వద్ద దరఖాస్తుదారుల కోలహాలం చోటు చేసుకుంది. రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారు 1,600 దరఖాస్తులను స్వీకరించినట్లు ఎక్సైజ్ అధికార వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండడంతో అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని అధికారులు అంటున్నా రు. దరఖాస్తుల స్వీకరణ ముగిసే సరికి సుమారు రెండు వేలకు పైగా దరఖా స్తులు వచ్చే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. టెం డరు దరఖాస్తుల స్వీకరణను ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ పర్య వేక్షిస్తున్నారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.