అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:25 AM
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజే స్తామని, రేషన్‌కార్డుల దరఖాస్తులు, జారీ నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మండలంలోని పర్లపల్లి గ్రామంలో రైతు వేదికలో పర్లపల్లి, నల్లగొం డ, మొగిళిపాలెం, పోలంపల్లి గ్రామాల ప్రజలకు కొత్త రేషన్ కార్డుల మంజురు ఉత్తర్వుల కాపీలను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు.
తిమ్మాపూర్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజే స్తామని, రేషన్‌కార్డుల దరఖాస్తులు, జారీ నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మండలంలోని పర్లపల్లి గ్రామంలో రైతు వేదికలో పర్లపల్లి, నల్లగొం డ, మొగిళిపాలెం, పోలంపల్లి గ్రామాల ప్రజలకు కొత్త రేషన్ కార్డుల మంజురు ఉత్తర్వుల కాపీలను కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా మంజురు చేయలేదన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందని, వివిధ ప్రభుత్వ పథకాలను మహిళల కోసం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది 150 స్వయం సహాయక సంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 78వేలకు పైగా రేషన్ కార్డుల మంజురు ప్రక్రియ కొనసాగుతుం దని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, తిమ్మాపూర్ తహసీల్ధార్ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు ఇతర అధికారులు పాల్గొన్నారు.