Share News

శరవేగంగా జిల్లా అభివృద్ధి

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:17 AM

పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పథంలో కొనసాగుతోంది.

 శరవేగంగా జిల్లా అభివృద్ధి

- ఆరెంద వద్ద మానేరు వంతెన నిర్మాణానికి రూ.203 కోట్లు

- రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌కు కేబినెట్‌ ఆమోదం

- పెద్దపల్లిలో మొదలైన ఆర్టీసీ డిపో నిర్మాణ పనులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పథంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌లు ప్రత్యేక శ్రద్ధతో తమ నియోజకవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. గడిచిన రెం డేళ్లలో జిల్లాకు సుమారు 3 వేల కోట్ల పైచిలుకు నిధులు జిల్లాకు ప్రభు త్వం ద్వారా మంజూరు కావడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రామగుండం ఎత్తిపోతల పథకం మిగులు పనులను పూర్తి చేసి రైతులకు వినియోగంలోకి తీసుకరావడంతో నియోజకవర్గంలోని కాలువ చివరి భూములకు సాగు నీరందుతున్నాయి. మంథని మండలం ఆరెంద నుంచి దామెరకుంట మీదుగా కాళేశ్వరం వెళ్లేందుకు దూరభారాన్ని తగ్గిం చేందుకు మానేరుపై మరో వంతెన నిర్మాణానికి ఇటీవల 203 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. రామగుండంలో గల బీ పవర్‌ హౌస్‌లో ఎన్టీపీసీ భాగస్వామ్యంతో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి, మేడిగడ్డ ఓసీపీలో సింగరేణి భాగస్వామ్యంతో 500 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాంతంలో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి.

ఫ మంథని నియోజక వర్గంలో..

మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు నియోజవకర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తీరుస్తు న్నారు. మంథని మండలం ఆరెంద నుంచి దామెరకుంట మీదుగా కాళే శ్వరం వెళ్లేందుకు దూరభారాన్ని తగ్గించేందుకు మానేరుపై మరో వంతెన నిర్మాణానికి ఇటీవల 203 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అంతకు ముందు ఏళ్ల తరబడి నిలిచి పోయిన చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథ కాన్ని పూర్తి చేసేందుకు 531 కోట్లు మంజూరయ్యాయి. అడవి సోమ న్‌పల్లిలో 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, పనులు నడుస్తున్నాయి. గోదావరి నదిపై మంథని నుంచి జైపూర్‌ శివ్వారం వరకు వంతెన నిర్మాణానికి 125 కోట్లు, మంథని బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి 42 కోట్లు, మంథనిలో ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే చోట ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయానికి 4 కోట్ల 50 లక్షలు, మున్సిపల్‌ కార్యాలయ నిర్మాణానికి 4 కోట్లు, మంథనిలో సమీకృత మార్కెట్‌ నిర్మా ణానికి 7 కోట్లు, రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు 6 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు కాగా పనులు నడుస్తున్నాయి.

ఫ పెద్దపల్లి నియోజక వర్గంలో...

పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కృషి చేస్తున్నారు. రూ.82 కోట్లతో బైపాస్‌ రోడ్డు మంజూరు కాగా, పనులు నడుస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ సుమారు 300 కోట్లు, జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణం కోసం 81 కోట్లు, రూపు నారా యణపేట మానేరు వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి 80 కోట్లు మంజూరయ్యాయి. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ 51 కోట్లు మంజూరు కాగా పనులు కొనసాగుతు న్నాయి. ఎలిగేడు, పెద్దపల్లి రూరల్‌, మహిళా, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు ఆరంభమయ్యాయి. పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణ పనుల డీపీఆర్‌ కోసం ప్రభుత్వం 2.5 కోట్లు మంజూరు చేశారు. పెద్దపల్లిలో 5 కోట్ల రూపాయ లతో మహిళా స్వశక్తి భవనం మంజూరు కాగా, రాఘవాపూర్‌ వద్ద పనులు నడుస్తున్నాయి. జిల్లా గ్రంథాలయ నూతన భవనానికి 5 కోట్లు మంజూరు కాగా, గత నెలలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ పక్కన గల స్థలంలో నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా 301.34 కోట్లు, పంచాయితీ రాజ్‌ శాఖ ద్వారా 51.14 కోట్లు మంజూర య్యాయి. పెద్దపల్లి మున్సిపాలిటీకి 77.86 కోట్లు, సుల్తానాబాద్‌ మున్సిపా లిటీకి 31.53 కోట్లు మంజూరు కావడంతో పనులు నడుస్తున్నాయి. విద్యుత్‌ శాఖ ద్వారా 25.89 కోట్లు, నీటి పారుదల శాఖ ద్వారా 2.06 కోట్లు, వ్యవసాయ మార్కెట్ల గిడ్డంగులకు 1.81 కోట్లు మంజూరు కావడంతో పనులు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్‌ డిపో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ఫ రామగుండం నియోజక వర్గంలో..

రామగుండం నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు కొనసాగుతు న్నాయి. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం 100 కోట్లు, స్టాంప్‌ డ్యూటీ 18 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. యూఐడీఏ ద్వారా 80 కోట్లు మంజూరు కావడంతో పనులు నడుస్తున్నాయి. అమృత్‌ 2.0 పథకం కింద ఎస్టీపీల నిర్మాణాలకు 120 కోట్ల నిధులు వచ్చాయి. ఎన్టీపీసీ సీఎస్‌ ఆర్‌ ద్వారా 8 కోట్లు, సింగరేణి ద్వారా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు మంజూరు కాగా, పనులు నడుస్తున్నాయి. అంతర్గత రోడ్ల నిర్మాణాలకు 15 కోట్లు, సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంగణ అభివృద్ధికి 6 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఇవేగాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు కావ డంతో పనులు కొనసాగుతున్నాయి. రామగుండంలో విమానాశ్రయం నిర్మాణం కోసం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ ఎంపీ వంశీకృష్ణతో కలిసి కృషి చేస్తున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 01:17 AM