Share News

రామడుగు పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

ABN , Publish Date - Jun 12 , 2025 | 01:03 AM

రామడుగు పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం సీపీ గౌస్‌ ఆలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీకి ఎస్‌ఐ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు

 రామడుగు పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ
రామడుగు పోలీస్‌ స్టేషన్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న సీపీ గౌస్‌ ఆలం

రామడుగు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రామడుగు పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం సీపీ గౌస్‌ ఆలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీకి ఎస్‌ఐ పూల మొక్క అందించి స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను, రికార్డులను సీపీ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబంధించిన సమాచారం సేకరించి నమోదు చేసుకోవాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో రూరల్‌ ఏసీపీ శుభం ప్రకాశ్‌, చొప్పదండి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌, రామడుగు ఎస్‌ఐ రాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 01:03 AM