Share News

రాజన్న ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమాదేవి

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:02 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవోగా ఎల్‌. రమాదేవి శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు.

రాజన్న ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమాదేవి

వేములవాడ కల్చరల్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవోగా ఎల్‌. రమాదేవి శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాజన్న ఆలయానికి ఉదయం రావడంతో ఆలయ అర్చకులు స్వస్తి వచనాలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం కల్యాణ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఈవో చాంబర్‌లో ఇన్‌చార్జి ఈవో రాధాబాయి చేతుల మీదుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు నూతన ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న చిత్రపటం అందజేసి సన్మానించారు. వెంట ఏఈవో శ్రావణ్‌కుమార్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ శర్మ, వెల్ది సంతోష్‌, వెంకటప్రసాద్‌, రాజేందర్‌, బొడుసు మహేష్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:02 AM