Share News

‘రాజీవ్‌ యువ వికాసం’ మరింత ఆలస్యం..

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:45 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం మరింత ఆలస్యం కానున్నది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులను మే నెలలోగా ఎంపిక చేసి జూన్‌ రెండవ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రొసీడింగ్స్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే దరఖాస్తులు కుప్పలు తెప్ప లుగా రావడంతో నిర్దేశించిన గడువు వరకు దరఖా స్తుల పరిశీలన పూర్తి కాలేదు. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.

‘రాజీవ్‌ యువ వికాసం’  మరింత ఆలస్యం..

- వచ్చిన దరఖాస్తులు 47,613

- కేటాయించిన యూనిట్లు 10,274

- రూ.50 వేలు, లక్ష దరఖాస్తులకు ప్రాధాన్యం

- కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం మరింత ఆలస్యం కానున్నది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులను మే నెలలోగా ఎంపిక చేసి జూన్‌ రెండవ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రొసీడింగ్స్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే దరఖాస్తులు కుప్పలు తెప్ప లుగా రావడంతో నిర్దేశించిన గడువు వరకు దరఖా స్తుల పరిశీలన పూర్తి కాలేదు. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.

జిల్లా వ్యాప్తంగా ఆయా కార్పొరేషన్ల ద్వారా 10,274 యూనిట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 4,416 యూనిట్లు, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 4,341 యూనిట్లు, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 431 యూని ట్లు, ఈబీసీలకు 817 యూనిట్లు, మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 539 యూనిట్లు కేటాయించారు. దరఖాస్తులు 47,613 వచ్చాయి. ఇందులో ఎస్సీలు 12,782 మంది, బీసీలు 30,953 మంది, ఎస్టీలు 934 మంది, మైనార్టీలు 2,944 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం ద్వారా 50 వేల యూనిట్‌కు వంద శాతం సబ్సిడీ, ఒక లక్ష రూపాయల వరకు 90 శాతం సబ్సిడీ, లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు 80 శాతం సబ్సిడీ, 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు 70 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందించనుంది. నాలుగు కేటగిరీల్లో దరఖాస్తులు వచ్చినప్పటికీ 50వేలు, లక్ష రూపాయల వరకు గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కేటగిరి ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూ ర్చేందుకు అవకాశం ఉండడంతో మొదట వీరికే ప్రాధా న్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో బ్యాంక్‌ సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సిబిల్‌ స్కోర్‌తో సంబంధం లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రక టించినప్పటికీ, అధికారులు, బ్యాంకర్లు వాటికే ప్రాధా న్యం ఇస్తున్నట్లు కనబడుతోంది. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు చాలామంది అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులతోపాటు ఎమ్మెల్యేల చుట్టూ తిరు గుతూ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

ఫ మండల, మున్సిపల్‌ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన

దరఖాస్తులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల ఆధ్వర్యంలో పరిశీలిస్తు న్నారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని, ఐదేళ్లలో ప్రభుత్వ పరంగా ఏ కార్పొరేషన్‌ నుంచి అయినా లబ్ధి పొందారా లేదా అనేది కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని చెల్లించకుండా డిఫాల్టర్‌గా జాబితాలో ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. వీటన్నింటినీ అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుండడంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతున్నది.

ఫ సిబిల్‌ స్కోర్‌ బాగుంటేనే..

బ్యాంకర్లు ఏ రుణం మంజూరు చేయాలన్నా లబ్ధిదారుల సిబిల్‌ స్కోర్‌ పరిశీలిస్తారు. ప్రభుత్వం ద్వారా అమలు చేసే పథకాలైన సరే బ్యాంకర్లు సిబిల్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుని రుణాలు అంది స్తుంటారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నా లబ్ధిదారుల ఎంపికలో సిబిల్‌ స్కోర్‌ను బ్యాంకు అధికా రులు పరిశీలిస్తున్నారు. యూనిట్లు మంజూరు చేసేం దుకు మరో వారం పది రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Jun 06 , 2025 | 12:45 AM