భక్తజన సంద్రంగా రాజన్న ఆలయం
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:36 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. శ్రీపార్వతిరాజరాజేశ్వర స్వామి వారలకు ఎంతో ఇష్టమైన సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయ కల్యాణకట్టలో
వేములవాడ కల్చరల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. శ్రీపార్వతిరాజరాజేశ్వర స్వామి వారలకు ఎంతో ఇష్టమైన సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్రస్నానాలను ఆచరిం చారు. ఆయ్యా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీలక్ష్మీగణపతిని తరువాత శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరించారు. శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నకు ఎంతో ప్రీతికరమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. పరివారం దేవతల ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకుని తరించారు. రాజన్న దర్శనానికి సుమారు మూడుగంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు.
రాజన్న సేవలో హాకీ ప్లెయర్ సౌందర్య
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని భారత హాకీ క్రీడాకారిణి సౌందర్య సోమవారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న ఆలయానికి వచ్చిన ఆమె ముందుగా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం గావించి రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. నిజమాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సౌందర్య చిన్న తనం నుంచి రాజన్న ఆలయానికి వస్తున్నట్లు తెలిపారు.