Share News

Rajanna siricilla : ‘స్థానిక’ సమరానికి రెడీ..

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:39 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) స్థానిక ఎన్నికలకు అధికార యంత్రాంగం రిజర్వేషన్ల లెక్క తేల్చా రు. పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ పార్టీలు రెడీ అంటు న్నాయి.

Rajanna siricilla :  ‘స్థానిక’ సమరానికి  రెడీ..

- రిజర్వేషన్ల లెక్క తేలింది.. జడ్పీ చైర్మన్‌ ఎస్సీ జనరల్‌

- రాజకీయ పార్టీల్లో మొదలైన జోష్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

స్థానిక ఎన్నికలకు అధికార యంత్రాంగం రిజర్వేషన్ల లెక్క తేల్చా రు. పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ పార్టీలు రెడీ అంటు న్నాయి. నోటిఫికేషన్‌ ఎప్పడు వచ్చినా ప్రత్యర్థులను ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలంటూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు కార్యక ర్తలకు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు అధికార యంత్రాంగం రెండు రోజుల క్రితమే స్థానిక ఎన్నికలకు సంబంధిం చి జిల్లాలోని 260 సర్పంచులు, 2268 వార్డులు, 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌ చైర్మన్‌ స్థానం 2019లో జనరల్‌ మహిళగా రిజర్వు అయింది. దీంతోపాటు జిల్లాలోని 12 జడ్పీటిసి స్థానాల్లో ఒకటి ఎస్టీ, మూడు ఎస్సీలు, ఐదు బీసీలు, మూడు జనరల్‌కు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికలు జరగడం ఖాయమని భావిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు స్థానిక ఎన్నికల పై తమ ప్రాబల్యాన్ని చాటుకునే దిశగా కసరత్తు ప్రారంభించారు.

వేగంగా ఎన్నికల ఏర్పాట్లు..

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ జారీచేసే అవ కాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసిన క్రమంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం తోపాటు శుక్రవారం సిబ్బందికి శిక్షణ కార్యక్రమా న్ని నిర్వహించింది. పోలింగ్‌ కేంద్రాలు, అవసరమయ్యే బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచారు. జిల్లాలో పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి 12 జడ్పీటీసీలు, 123 ఎంిపీటీసీ స్థానాలకు సంబంధించి 712 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నరు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2268 వార్డు సభ్యులు ఉండగా 1734 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు.

Updated Date - Sep 29 , 2025 | 12:39 AM