రాజన్న ఆలయం మూసివేతకు వ్యతిరేకం..
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:35 AM
అభివృద్ధికి బీజేపీ అడ్డంకులు సృష్టించదని, అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని మూసివేతను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.
వేములవాడ రూరల్, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధికి బీజేపీ అడ్డంకులు సృష్టించదని, అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని మూసివేతను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. వేములవాడ బీజేపీ రూరల్ మండల కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లా డుతూ అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని మూసివే యడంపై బీజేపీ పక్షాన వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆగమన శాస్త్రం ప్రకారం దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధిని భార తీయ జనతా పార్టీ స్వాగతిస్తోందన్నారు. అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేసి భక్తులకు రాజన్ననే దూరం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజన్న ఆలయం మూసివేసి హిందు వుల మనోభావాలను దెబ్బతీసేందుకు పెద్దఎత్తున కుట్ర జరుగుతోం దని పాలకపక్షంతీరును ఆయన దుయ్యబట్టారు. ఆలయాన్ని మూసి వేస్తే సహించేది లేదన్నారు. అభివృద్ధిలో భాగంగా ఆలయ ప్రధాన రహదారి విస్తరణ తప్పని తరుణంలో తాము స్వాగతించామన్నారు. కానీ ఆలయ అభివృద్ధి పేరిట హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరకోబోమన్నారు. కేంద్రంలో భార తీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాశీ విశ్వనాఽథుడి ఆలయాన్ని, ఉజ్జయనీ మహంకాళి ఆలయాన్ని వందల కోట్లతో అభి వృద్ధి చేశామన్నారు. ఆయా ఆలయాల పునర్నిర్మాణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఎక్కడా ఆలయాలు మూసివేయడం జరగ లేదన్నారు. కానీ ఇక్కడ భిన్నంగా ఆలయ అభివృద్ధి పేరిట రాజరాజే శ్వర స్వామివారి క్షేత్రాన్ని మూసివేసి భక్తులకు రాజన్నను ఎందుకు దూరం చేస్తున్నారన్నారు. రాజన్న ఆలయం మూసివేసి భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శన సౌకర్యాలను కల్పించడమేంటని ఆయన ప్రశ్నించారు. భక్తులు రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా సమర్పి స్తారని బీజేపీ సీనియర్ నాయకుడు ప్రతాప రామకృష్ణ పదే పదే ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజన్న ఆలయంలో దర్గాను వేరే చోటికి తరలించాల న్నారు. సమ్మక్క, సారలమ్మ ఆలయాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మక్క, సారాలమ్మ జాతరకు వెళ్లే ముందు భక్తులు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలియదా అని ప్రశ్నించారు. రాజన్న ఆలయ మూసివేతకు బీజీపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. బీజేపీ ఆలయాల అభివృద్ధిని స్వాగతిస్తుందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించకుండా అభివృద్ధి పనులు చేయాలన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాజన్న ఆలయాన్ని అభివృధ్దిపేరిట మూసి వేయడానికి పూనుకుంటే రాజన్న భక్తులు, వేలాదిమంది హిందువుల తో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతి రెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ మల్లేశం, కార్యదర్శి గోపాడి సురేందర్‌రావు, రూరల్ మండల అధ్యక్షుడు బురుగుపల్లి పర మేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.