Share News

అసమానతలు రూపుమాపడానికి రాహుల్‌గాంధీ కృషి

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:26 AM

దేశంలో అసమానత లను రూపుమాపడానికి రాహుల్‌గాంధీ చేస్తున్న కృషి మరిచిపోలేనిదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అసమానతలు రూపుమాపడానికి రాహుల్‌గాంధీ కృషి

వేములవాడ టౌన్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో అసమానత లను రూపుమాపడానికి రాహుల్‌గాంధీ చేస్తున్న కృషి మరిచిపోలేనిదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మున్సిపల్‌ పరిధి లోని తిప్పాపూర్‌లో రాహుల్‌గాంధీ జన్మదినాన్ని పురష్కరించుకుని కేక్‌కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీని వాస్‌ మాట్లాడుతూ రాజన్న ఆశీస్సులు ఆయనపై ఉండాలని అకాం క్షించారు. వేములవాడ నియోజకవర్గానికి గత ఎన్నికల సమయంలో రెండుసార్లు వచ్చారని గుర్తు చేశారు. రోడ్డు షోటలో మేడిపల్లి మండ ల కేంద్రానికి, ఎన్నికల సమయంలో వేములవాడకు పట్టణానికి ఒక సారి వచ్చారని అన్నారు. తన గెలుపు కోసం, ప్రభుత్వం అధికారంలోకి రాండం కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు ఆయన ప్రసంగించిన తీరు మర్చిపోలేనిదని కొనియాడారు. ప్రపంచంలో ఎవరికి సాథ్యం కానీ విధంగా పాదయాత్ర చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి మేఘా లయ వరకు పాదయాత్ర చేసి దేశంలోని పేద ప్రజల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని వివరించారు. దేశంలో అసమానతలను తొలగించి దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని సంకల్పించిన గొప్ప నాయకుడని, అందులో భాగంగానే రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్‌ అమలు చేయడం జరిగిందని రానున్న రోజులు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు రానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కనికరపు రాకేష్‌, సంద్రగిరి శ్రీనివాస్‌, కూరగాయాల కొమురయ్య, గూడూరి మధు, పాత సత్య లక్ష్మీ, పీర్‌మహ్మద్‌, రాజు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:26 AM