రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:02 AM
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం కాగా, పోలీసులు పట్టణ అధ్యక్షుడు దుమా ల శ్రీకాంత్ అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధం కాగా, పోలీసులు పట్టణ అధ్యక్షుడు దుమా ల శ్రీకాంత్ అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్ర మంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి, ఎల్లారెడ్డిపేట మండ ల అధ్యక్షురాలు పూర్ణిమ, తంగళ్లపల్లి మండల అధ్యక్షురాలు భవిత, బీజేపీ పట్టణ ప్రధానకార్యదర్శి కొండ నరేష్, ఎస్టీసెల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మొగిలిరాజు, జిల్లా వాణిజ్య సెల్ కో-కన్వీనర్ వంగా దేవేం దర్‌రెడ్డి, మోర శ్రీహరి, సిద్దిదేవరాజు, రాహూల్, ప్రతాప్, బండారి వెం కన్న, పల్లికొండ నర్సయ్య పాల్గొన్నారు.