Raajanna siricilla : సన్నాల వైపే మొగ్గు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:06 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) యాసంగి సన్నాల ధాన్యం బోనస్ డబ్బులు ఇంకా జమ కాలేదు. అయినా ఖరీఫ్ సీజన్‌లో రైతులు సన్నరకాల సాగుకు మొగ్గు చూపారు.
- జిల్లా వ్యాప్తంగా 12 వేల ఎకరాల్లో సాగు
- ఖరీఫ్‌లో 1.84 లక్షల ఎకరాల్లో వరి..
- యాసంగిలో సన్నరకం ధాన్యం బోనస్ పెండింగ్
- జిల్లాలో 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
యాసంగి సన్నాల ధాన్యం బోనస్ డబ్బులు ఇంకా జమ కాలేదు. అయినా ఖరీఫ్ సీజన్‌లో రైతులు సన్నరకాల సాగుకు మొగ్గు చూపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ పంటల సాగులో వరినాట్లు ముగిసాయి. జిల్లాలో 1.84లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో జిల్లావ్యాప్తంగా 12వేల ఎకరాల్లో సన్నరకం ధాన్యం సాగు చేశారు. 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి ప్రోత్సాహంగా క్వింటాలుకు రూ 500 బోనస్ అందిస్తుండటంతో రైతులు సన్నాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. యాసంగిలో విక్రయించిన సన్న రకం ధాన్యానికి రావాల్సిన బోనస్ పెండింగ్ ఉన్నప్పటికీ జిల్లా రైతులు సన్న రకాల సాగు వైపు ఆసక్తి చూపారు.
ఫ జిల్లాలో బోనస్ రూ 4.38 కోట్లు పెండింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్లో 244 కొనుగోలు కేంద్రాల ద్వారా 44767 మంది రైతుల నుంచి రూ 627.50 కోట్లు విలువైన 2.70లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం ధాన్యం 2.61 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకం 9254 మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నరకం దాన్యంలో ఐకేపీ ద్వారా 7561 మెట్రిక్ టన్నులు, సింగిల్ విండోల ద్వారా 1588 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 104 మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 1255 మంది రైతులు సన్నరకం బోనస్‌కు అర్హులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బోనస్ బకాయిలు రూ 4.38 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వానాకాలం సీజన్ సాగు పనులు పూర్తి అయినా సన్న రకం బోనస్ విడుదల కాకపోవడంతో రైతులకు పెట్టుబడికి ఉపయోగకరంగా లేకుండా పొయింది.
ఫ జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు
వానాకాలం సీజన్‌కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 235330 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి 184310 ఎకరాలు, మొక్కజొన్న 3748 ఎకరాలు, పత్తి 46485 ఎకరాలు, కందులు 660 ఎకరాలు, పెసర 30 ఎకరాలు, ఇతర పంటలు 137 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో సాగుకు సంబంఽధించి మండలాల్లో గంభీరావుపేట మండలంలో 18598 ఎకరాల్లో సాగు కాగా, ఇల్లంతకుంటలో 36970 ఎకరాలు, ముస్తాబాద్‌లో 23835 ఎకరాలు, సిరిసిల్ల 5623 ఎకరాలు, తంగళ్లపల్లి 21086 ఎకరాలు, వీర్నపల్లి 8300 ఎకరాలు, ఎల్లారెడ్డిపేట 21100 ఎకరాలు, బోయినపల్లి 19167 ఎకరాలు, చందుర్తి 21367 ఎకరాలు, కోనరావుపేటలో 23140 ఎకరాలు, రుద్రంగి 10964, వేములవాడ 10038 ఎకరాలు, వేములవాడ రూరల్ 15142 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో ప్రధాన పంటలుగా వరి, పత్తి సాగు వైపే మొగ్గు చూపారు. జిల్లాలో వరి సాగులో గంభీరావుపేటలో 18500 ఎకరాల్లో నాట్లు వేసుకోగా, ఇల్లంతకుంటలో 24000 ఎకరాలు, ముస్తాబాద్‌లో 23000 ఎకరాలు, సిరిసిల్లలో 4800 ఎకరాలు, తంగళ్లపల్లిలో 20100 ఎకరాలు, వీర్నపల్లిలో 8000 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 17500 ఎకరాలు, బోయినపల్లిలో 12600 ఎకరాలు, చందుర్తిలో 15100 ఎకరాలు, కోనరావుపేట 18300 ఎకరాలు, రుద్రంగిలో 5910 ఎకరాలు, వేములవాడలో 5200 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 11300 ఎకరాల్లో వరి సాగు జరిగింది. పత్తి సాగు జిల్లాలో 46385 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. ఇందులో గంభీరావుపేటలో 85 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12000 ఎకరాలు, ముస్తాబాద్‌లో 530 ఎకరాలు, సిరిసిల్లలో 800 ఎకరాలు, తంగళ్లపల్లిలో 870 ఎకరాలు, వీర్నపల్లిలో 300 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3600 ఎకరాలు, బోయినపల్లిలో 6400ఎకరాలు, చందుర్తిలో 6200 ఎకరాలు, కోనరావుపేట 4800 ఎకరాలు, రుద్రంగిలో 2200ఎకరాలు, వేములవాడలో 4800 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 3800 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు.