ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ABN , Publish Date - Jun 11 , 2025 | 12:56 AM
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, పిల్లలందరిని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటుకం రమేష్ కోరారు.
సిరిసిల్ల రూరల్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, పిల్లలందరిని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటుకం రమేష్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో మంగళవారం తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర కృష్ణప్రసాద్‌గౌడ్, బోయన్న గారి నారాయణల ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీని పట్టణంలోని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య, ఏఐ ఆధారిత విద్య, డిజిటల్ విద్యలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అందిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలందరిని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెంబర్‌షిప్ కన్వీనర్ సుంకిశీల ప్రభాకర్‌రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు మోతీలాల్, టీఅర్‌టీఎఫ్ నాయకులు పోతుగంటి రమేష్, మహేశుని లక్ష్మీనారాయణ, గోలీ రాధాకిషన్, ముత్తయ్యగారి నాగరాజు, జిల్లెల్ల శ్రీనివాస్‌గౌడ్, ఇప్పకాయల ప్రకాష్, రాజశేఖర్, దేవేందర్, పప్పుల శ్రీనివాస్, సామల రాములు, కుమారస్వామి, పులి ప్రవీన్‌కుమార్, కోల వినయ్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు బాల ఎల్లయ్య, కొమురయ్య, సుల్తాన్ రాజు, బూట్ల శ్రీనివాస్, శ్రీనివాస రావు, మామిడాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.