Share News

ఉన్నత విద్యనభ్యసించి ఆదర్శంగా నిలవాలి

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:17 AM

విద్యార్ధులు ఉన్న త విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో స్ధిరపడి పలువురికి ఆదర్శంగా నిలవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ పిలుపునిచ్చారు.

ఉన్నత విద్యనభ్యసించి ఆదర్శంగా నిలవాలి

తంగళ్లపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్ధులు ఉన్న త విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో స్ధిరపడి పలువురికి ఆదర్శంగా నిలవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం నేరెళ్ల బాలికల గురుకుల పాఠశాలను ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ పరిశీలించారు. ఎంత మంది హాజ రయ్యారు, సెలవులో ఎంత మంది ఉన్నారు.. తదితర విష యాలపై ఆరా తీశారు. సెలవుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. కిచెన్‌లో మోనూ చార్ట్‌ను పరిశీలించి మోనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టోర్‌ రూంలో ఉన్న కూరగాయలు, కోడిగుడ్లు పరిశీలించారు. నాణ్యత లేకపోవడంతో వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అందు బాటులో ఉన్న సరుకుల వివరాల రిజిస్టరును పరిశీలించారు. విద్యా ర్థుల వసతి గదులు పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్‌ మీ అధ్యాపకుల బోధన ఎలా ఉంది..? పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారు..? ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక ఎవరె వరు ఏయే విభాగాల్లో విద్యను అభ్యసించడానికి ఆసక్తిగా ఉన్నారు..? మోనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అనే వివరాలను క్లుప్తం గా అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థిని నిత్యం విద్యను అభ్య సిస్తూ ఉత్తమ ప్రతిభ కనబచ్చి టీచర్‌, లాయర్‌, ఇంజనీర్‌, డాక్టర్‌ తదితర రంగాల్లో స్థిరపడాలని, ఆర్థికంగా స్వంతంత్రత సాధిం చాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు ఎదిగితే తమ ప్రాంతాలలోని మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తారని స్పష్టం చేశారు. మోనూలో అందించే పోషకాహారం ఖచ్చితంగా తినాలని సూచించారు. కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితే నిర్ధే శించుకున్న లక్ష్యం సాధించడానికి సులభతరం అవుతుందని పేర్కొ న్నారు. ఈ విషయాన్ని గ్రహించి చదవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో తహసీల్దార్‌ జయంత్‌, ప్రిన్సిపాల్‌ రాధ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:17 AM