Share News

చివరి గింజ వరకు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు

ABN , Publish Date - May 17 , 2025 | 12:39 AM

యాసంగి సీజన్‌లో రైతులు పండిం చిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తా మని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు.

చివరి గింజ వరకు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు

సిరిసిల్ల, మే 16 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో రైతులు పండిం చిన ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తా మని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైద రాబాద్‌ నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌లతో కలిసి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్‌ లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

వేములవాడ అర్బన్‌ తహసీల్‌ కార్యాలయం నుంచి బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, రుద్రంగి గ్రామపంచాయతీ కార్యాల యం నుంచి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ఝా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజ మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రికార్డుస్థాయిలో 57లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అయ్యిందన్నారు. ప్రభుత్వం దాదాపు రూ.17వేల కోట్లు ఖర్చు చేస్తూ 70లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు చేస్తుందని, వీటికి అదనంగా సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌ రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నామని అన్నా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ పూర్తిచేసిన 48గంటల్లో రైతులకు ఖాతాలో డబ్బు జమ అవుతుందన్నారు. భారీస్థాయిలో కొనుగో లు జరుగుతున్నప్పటికీ మీడియాలో సరిగ్గా కవర్‌ కావడం లేదన్నారు. పత్రికల్లో వచ్చే నెగెటివ్‌ వార్తలపై స్పందించాలని, తప్పుడు వార్తలను తీప్పికొట్టాలని, సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలన్నారు. రాబోయే 15 రోజులలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానున్న నేపథ్యంలో కొను గోళ్లు వేగవంతంచేయాలని ఆదేశించారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

అకాలవర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా నా ణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని, తడిచిన ధాన్యాన్ని కూడా రైతు సంక్షేమం దృష్టిలో ఉంచు కొని కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల దగ్గర నుంచి మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేయడం ప్రాధాన్యతగా అత్యవసర పరిస్థితుల్లో డిఫాల్ట్‌ రైస్‌మిల్లర్లకు ధాన్యం కేటాయించడానికి అనుమతులు కూడా కలెక్టర్లకు జారీ చేస్తున్నామని తెలిపారు. జనవరి 26,2025 తరువాత రాష్ట్రంలో నూతనంగా 1,57,467 రేషన్‌ కార్డులను పంపిణీ చేశామని, వీటి ద్వారా 16లక్షల 67వేల 936మంది లబ్ధిదారులకు అదనంగా రేషన్‌ అందుతుందన్నారు. మీసేవ కేంద్రాలు, ప్రజా పాలన కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల విచారణ పూర్తి చేసి అర్హులకు రేషన్‌ కార్డులను జారీ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడు తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా యాసంగి పంట కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రా లను రెగ్యులర్‌గా కలెక్టర్లు తనిఖీ చేయాలని, క్షేత్రస్థాయి లో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా 7లక్షల 70వేల 477 మంది రైతుల నుంచి 49.53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.8,042 కోట్లు మద్దతు ధర కింద చెల్లించామన్నారు. గతం కంటే అధి కంగా ఈ యాసంగి సీజన్‌లో మనం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మే 15 నాటికి 2022-23 రబీ సీజన్‌లో 25.35 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 2023-24 రబీ సీజన్‌లో 32.93 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఈ సంవత్సరం 49.53 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామ న్నారు. ప్రతి రోజు అదనపు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షిస్తున్నామన్నారు. మే నెలాఖ రుకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. మనం కొనుగోలు చేసిన ధాన్యం నింపేందుకు మాత్రమే వినియోగించాలని అన్నారు. గత ఆరు నెలల కాలంలో రేషన్‌ తీసుకోకపోవడం, ఇతర రాష్ట్రాలకు చెందిన డూప్లికేట్‌ బెనిఫిషరీ వంటి కారణాల వల్ల భారత ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 96వేల 240 రేషన్‌ కార్డుల పరిధిలోని లక్ష 62వేల 777మంది లబ్ధిదారులు అనుమా నాస్పదంగా ఉన్నారని, జిల్లాల వారీగా విచారణ చేసి వివరాలు సమర్పించాలన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:41 AM