Share News

2న తుది జాబితాల ప్రచురణ

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:58 AM

గ్రామపంచా యతీ ఓటర్ల తుదిజాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితా సెప్టెంబర్‌ 2న ప్రచురించడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలు ఉంటే శనివారం సాయంత్రంలోగా అందించాలని కలెక్టర్‌ సందీప్‌కు మార్‌ ఝా కోరారు.

2న తుది జాబితాల ప్రచురణ

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : గ్రామపంచా యతీ ఓటర్ల తుదిజాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితా సెప్టెంబర్‌ 2న ప్రచురించడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలు ఉంటే శనివారం సాయంత్రంలోగా అందించాలని కలెక్టర్‌ సందీప్‌కు మార్‌ ఝా కోరారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్ర వారం గ్రామపంచాయితీ ఓటర్‌ లిస్ట్‌, పోలీంగ్‌ కేంద్రాల లిస్ట్‌లపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితా అప్‌డేట్‌ చేయడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల పరిధిలో 260 గ్రామపంచాయతీలలో 2268 వార్డుల లో 3లక్షల 52వేల 134 మంది ఓటర్లతో డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితా ఆగస్టు 28న విడుదల చేసి గ్రామపంచాయతీ కార్యాలయాలల్లో అంటించడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ వారిగా డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితా తయారు చేశామని, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఆ జాబితాలను పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే శని వారంలోగా తెలియజేయాలన్నారు. ఆగస్టు 31లోపు వచ్చిన అభ్యంత రాలను పరిష్కరించి సెప్టెంబర్‌ 2న తుది ఓటర్‌ జాబితాను ప్రచు రించడం జరుగుతుందన్నారు. ప్రతి మండల పరిధిలో గ్రామపంచా యతీ ఎన్నికల నిర్వహణకు 2268 డ్రాఫ్ట్‌ పోలింగ్‌ కేంద్రాల జాబితా ఎంపీడీవో ఆగస్టు 28న తయారుచేశారని వీటిపై అభ్యంతరాలు ఉంటే ఎంపీడీవో కార్యాలయాల్లో శనివారం సాయంత్రంలోగా అందించాలని కోరారు. సెప్టెంబర్‌ 2న తుది పోలింగ్‌ కేంద్రాల జాబితా తయారు చేయడం జరుగుతుందన్నారు. 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున ఏర్పాటుచేయడం జరుగుతుందని, జిల్లాలో ఎక్కడైనా అదనపు పోలింగ్‌ కేంద్రం అవసరం ఉంటే వివరాలు అందిస్తే పరిశీ లించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి షరీప్పుద్దీన్‌, డివిజ నల్‌ పంచాయతీ అధికారి నరేష్‌, రాజకీయ పార్టీలకు చెందిన భారతీ య జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అఽధ్యక్షుడు తోట ఆగయ్య, తెలుగు దేశం పార్టీ నాయకులు తీగల శేఖర్‌గౌడ్‌, తంగళ్లపల్లి మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు గజభీంకార్‌ రాజ న్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 12:58 AM