Share News

ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:36 AM

ప్రజా సమస్యలను త్వ రగా పరిష్కరించాలని కలెకర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదే శించారు.

ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలను త్వ రగా పరిష్కరించాలని కలెకర్‌ సందీప్‌కుమార్‌ ఝా అధికారులను ఆదే శించారు. సోమవారం కలెక్టరేట్‌కు సోమవారం ప్రజలు తమ సమస్యల ను ప్రజావాణిలో చెప్పుకునేందుకు జిల్లా నలుమూల నుంచి కలెక్టరేట్‌కు తరలివవచ్చారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి పోలీసుల బందోబస్తుల మధ్య నిర్వహించారు. కలెక్టర్‌ సందీ ప్‌కుమార్‌ ఝా, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌, డీఆర్‌ డీవో శేషాద్రిలు పాల్గొని సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో 114 దరఖాస్తులు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు 36, గృహనిర్మాణ శాఖకు 26, డీఅర్‌డీవో కు 20, ఉపాఽధి కల్పన శాఖకు 7, జిల్లా పంచాయతీరాజ్‌ శాఖకు 5, జిల్లా సంక్షేమ శాఖకు 5, పౌర సరఫరాల శాఖకు 4, సెస్‌కు 3, ఎస్‌డీసీకి 2, సిరిసిల్ల మున్సిపాల్టీకి 2, వ్యవసాయ శాఖకు 1, వైద్య ఆరోగ్య శాఖకు 1, ఎస్పీ కార్యాలయానికి 1, విద్యా శాఖకు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరగా పరిష్కారం చూపాపడంతోపాటు అర్జీదారులకు లిఖిత పూర్వకం గా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్‌ ఈఈ శంక ర్‌, జిల్లా పంచాయతీ అధికారి షర్పుద్దీన్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సన్న రకం ధాన్యానికి బోనస్‌ను చెల్లించండి

- కలెక్టరేట్‌కు తరలివచ్చిన కోనరావుపేట రైతులు

మూడు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన సన్నరకం ధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ 5వందల బోనస్‌ డబ్బులను అందించాలంటూ కోనరావుపేట మండలానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాను కలిసి సమస్యలను విన్నవించి వినతిపత్రాన్ని అందించారు. కోనరావుపేట మండలంలో మూడు నెలల క్రితం తాము పండించిన సన్నరకం ధాన్యం ను విక్రయించడం జరిగిందని దానికి రావాల్సిన బోనస్‌లను ఇప్పటి వరకు చెల్లించలేదని ప్రస్థుతం వ్యవసాయ పనులు కొనసాగుతుం డడంతో తమ పంటల సాగుకు పెట్టుబడులకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్‌ స్పందించి తమకు రావాల్సిన బోనస్‌ డబ్బులను చెల్లించి తమను అందుకోవాలని రైతులు తోల మల్లేశం, మాలోతు శంకర్‌నాయక్‌, శ్రీనివాస్‌, రత్నాకర్‌ మాధవరెడ్డిలు కోరారు.

వెన్నుపూస ఆపరేషన్‌కు సహకరించండి..

- మిడిదొడ్డి స్వాతిక, రాచర్లబొప్పాపూర్‌, ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొ ప్పాపూర్‌ గ్రామానికి చెందిన మిడిదొ డ్డి మల్లేశం, భాగ్య దంపతులకు పెద్ద కూతు రిని. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చుదు వుతున్నాను. ఏప్రిల్‌లో అడు కుంటూ పడిపోవడంతో నిల బడేం దుకు సైతం ఇబ్బందులు పడుతున్నాను. నిరుపేదలైన నా తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా వెన్నుపూసలో ప్రా బ్లమ్‌ ఉందని, ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారు. ఇప్పటివరకు రూ.2లక్షల వరకు అప్పులు చేసి వైద్య పరీక్షలు చేయించారు. నిమ్స్‌లో నాకు ఆపరేషన్‌కు రూ.3లక్షలు అవుతాయని డాక్టర్‌ చెప్పారు. కలెక్టర్‌ స్పందించి నాకు ఆపరేషన్‌ చేయిం చి నన్ను ఆదుకోవాలని కోరుతున్నాను.

అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలి

- లింగంపల్లి తిరుపతి, చింతల్‌ఠాణా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, వేములవాడ అర్బన్‌

వేములవాడ అర్బన్‌ మండలంలోని చింతల్‌ఠాణా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో అక్ర మంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిం చిన భవనాలపై చర్యలు తీసుకోవాలి. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో గుర్రం బాలకిషన్‌ అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కాలనీలోని సర్వేనంబర్‌ 487లో గత 2 సంవత్సరాలను ఎలాంటి అనుమ తులు తీసుకోకుండా నిర్మాణాలు చేప ట్టాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నిర్మాణాల కోసం తీసిన గుంతలో గత నెల 5వ తేదీన కాలనీకి చెందిన నలుగురు పిల్లలు అడు కుంటుండగా రిష అనే ఆరు సంవత్సరాల బాలుడు ఆ నీటి గుంతలో పడి చనిపోయాడు. దీనిపై వెంటనే కలెక్టర్‌ విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలి.

భూమిని అమ్ముకోకుండా అడ్డుకుంటున్నారు..

- కొండూరి రాజమౌళి, వేములవాడ

వేములవాడలో నివాసం ఉంటున్న నాకు ఐదుగురు అడపిల్లలు, ఒక్క కుమా రుడు ఉన్నారు. అందరికి పెళ్లి చేశాను. నా కుమారుడు కొండూరి శ్రీనివాస్‌కు వేములవాడలో ఉన్న ఆస్తితో పాటు బ్యాంక్‌లో ఉన్న డబ్బులు సైతం ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి మా భార్యభర్తలను పట్టించుకోవడం లేదు. నాకు కొడిమ్యాల మండలం తిప్పా యిపల్లె గ్రామంలో సర్వే నంబర్‌ 11 ఇలో ఉన్న 10 గుంట భూమి, 12ఇలో ఉన్న 12గుంటలు, 14 గుంటలు, 13లో 2గుంటలు నాపేరున ఉన్నాయి. మా భార్యభర్తలం అనారోగ్యంతో ఉన్నాం. మాకు ఖర్చుల కోసం ఆ భూములను అమ్ముకుందామంటే నా కుమారుడు శ్రీనివాస్‌ అడ్డుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. కలెక్టర్‌ స్పందించి మాకు న్యాయం చేయాలి.

ఇంటి నంబర్‌ ఇప్పించండి..

- కంచర్ల పోషయ్య, పోత్గల్‌, ముస్తాబాద్‌

ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌ గ్రామంలో 16 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ అనుమతులతో ఇంటిని నిర్మించుకున్నాను. ఇంటికి నంబర్‌ను ఇవ్వాలంటూ గ్రామపంచాయతీ అధికా రుల చుట్టూ గత 16 సంవత్సరాలుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ స్పందించి నా ఇంటికి నం బర్‌ను ఇప్పించి ఆదుకోవాలి.

Updated Date - Aug 12 , 2025 | 12:36 AM