Share News

జవాబుదారీతనంతో ప్రజాప్రభుత్వ పాలన..

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:06 AM

ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారితనంతో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో రంగరించి సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అవుతున్నామన్నారు.

జవాబుదారీతనంతో ప్రజాప్రభుత్వ పాలన..

- ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా ముందుకు..

- ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాల్లో రూ.27 కోట్లు జమ

- ‘రాజన్న’ క్షేత్రం అభివృద్ధి, విస్తరణకు రూ.213 కోట్లు

- జిల్లాలో కొత్తగా 14074 రేషన్‌ కార్డుల పంపిణీ

- శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

- జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారితనంతో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో రంగరించి సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అవుతున్నామన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. పోలీస్‌ గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌ బీ గితేలు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నానన్నారు. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేశారన్నారు.

మహిళా శక్తితో వ్యాపార రంగంలోకి...

మహిళా శక్తి పథకంతో వ్యాపార రంగం వైపు మహిళలు అడుగులు వేస్తున్నారని ఆదిశ్రీనివాస్‌ అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు జిల్లాలోని గ్రామైక్య సంఘాల ద్వారా 23 ఫర్టిలైజర్‌ షాపులు ఏర్పాటు చేశామన్నారు. 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర్‌ సంఘటన్‌ జాతీయ అవార్డును రాష్ట్రం నుంచి ఇల్లంతకుంట మండలం ఆదర్శ మండల సమాఖ్య ఢిల్లీలో కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకున్నారని తెలిపారు. యాసంగి సీజన్‌లో 189 కొనుగోలు కేంద్రాల్లో 33972 మంది రైతుల నుంచి రూ 469.98 కోట్ల విలువైన 20.25లక్షల క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేశామన్నారు. గ్రామైఖ్య సంఘాలకు రూ.6.48 లక్షల ఆదాయం చేకూరిందన్నారు, మహిళా సభ్యులకు ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 5691 లక్ష్యానికి ఇప్పటి వరకు 1586 యూనిట్లను గుర్తించి, 715 యూనిట్లను గ్రౌండింగ్‌ చేశామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌హెచ్‌జీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లోని 32269 మంది విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాంలు కుట్టించామని, సభ్యులకు రూ.24.20లక్షల ఆదాయం చేకూరిందన్నారు. గంభీరావుపేట మండలము లింగన్నపేటలో శ్రీషిరిడిసాయి గ్రామైఖ్య సంఘం ద్వారా ఇటీవలనే పెట్రోల్‌ పంపు ప్రారంభించామని, జిల్లా సమాఖ్య ద్వారా సిరిసిల్లలో మరో పెట్రోల్‌ పంపు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాలోని తొమ్మిది మండల సమాఖ్యలకు తొమ్మిది ఆర్టీసీ బస్సులను ఇప్పించామని, ప్రతినెల రూ.69 వేల 468 ఆర్టీసీ ద్వారా మండల సమాఖ్యలకు ఆదాయం చేకూరుతున్న దన్నారు. గ్రామ మహిళా సంఘాలకు ఎనిమిది ఎకరాల భూమి గుర్తించి, రూ.7.25కోట్లతో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాలో చేయూత పింఛన్లు లక్షా 17 వేల 549 మందికి ప్రతినెలా రూ 25 కోట్ల 88 లక్షలు పంపిణీ చేస్తున్నామన్నారు. వన మహోత్సవం కింద 6.77 లక్షల మొక్కల లక్ష్యానికి 5.50 లక్షల మొక్కలు నాటామన్నారు. మెప్మా పరిధిలో 2025-26 స్వయం సహాయక సంఘాలకు రూ34.49 కోట్ల విలువైన బ్యాంక్‌ లింకేజీల రుణాలు, 784మంది సభ్యులకు స్త్రీ నిధి రుణాలు రూ7.55 కోట్లు అందించామన్నారు. జిల్లాలో రూ.4 కోట్ల 48 లక్షలతో 283 వ్యక్తిగత యూనిట్లు, రూ.35 లక్షల తో ఐదు గ్రూప్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 27 కోట్లు జమ

సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి సామాన్యుడి జీవిత కలగా ఉంటుందని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. సొంత ఇంటి కల సాకారానికి అనుమతి ఇచ్చి, నిధులు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తున్నదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణం నిమి త్తం లబ్ధిదారులకు రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, జిల్లాలో 12వేల623 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా, 7వేల927 ఇళ్లు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు, మిడ్‌మానేర్‌ ముంపు గ్రామాల ప్రజలకు 4696ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింద న్నారు. ఇప్పటివరకు 8927 ఇంటి నిర్మాణాలకు మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5222 ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముగ్గు పోయడం జరిగిందని, వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ప్రభుత్వం రూ.27 కోట్లకు పైగా నేరుగా జమ చేసిందన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో మోడల్‌ ఇందిరమ్మ గృహాలు ఒక్కొక్కటి రూ. 5లక్షల వ్యయంతో పూర్తి చేశామన్నారు.

వేములవాడకు భారీగా నిధులు..

వేములవాడ టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ద్వారా రాజన్న భక్తుల కు వేగంగా, సులువుగా దర్శనం, వసతి కల్పించేందుకు భారీగా నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.213 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆలయఅభివృద్ధి పనులకు సీఎం, ఇతర మంత్రులు భూమితో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. దీనిలో భాగంగా రూ.35.25 కోట్ల అంచనాలతో అన్నదాన సత్రం నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయని, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు రూ.10కోట్లతో వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.12కోట్లతో గుడి చెరువులో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని, రాజరాజేశ్వర స్వామి ఆల యానికి క్రమంగా ఆదాయం సమకూరేందుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిం చేందుకు రూ.25కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, భీమేశ్వర ఆలయం లో రూ.3.44 కోట్లతో కల్యాణ మండపం, హోమ, వ్రత మండపం, షెడ్‌ నిర్మాణం, క్యూలైన్లు, సీసీ ఫ్లోరింగ్‌ పనులు చేపడుతామని, గోశాలలోని జీవాలకు పచ్చిగడ్డి సమస్య పరిష్కారానికి 40ఎకరాల ప్రభుత్వ భూమిలో పచ్చిగడ్డి పెంచేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. తిప్పాపూర్‌ బస్టాండ్‌ నుంచి రాజరాజేశ్వర స్వామి ఆలయం దాకా ప్రధాన రహదారి విస్తరణకు ప్రభుత్వం రూ.47 కోట్లు మంజూరు చేసిందని, ప్రభుత్వ ప్రత్యేక చొరవతో కలెక్టర్‌ ఆధ్వర్యంలో 80 ఫీట్ల మేర రోడ్డు నిర్మించేందుకు విస్తరణ పనులు ఇటీవల ప్రారంభించామన్నారు. మూలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలోనే మొదలు పెడుతామన్నారు.

సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని..

సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందని ఆది అన్నారు. రాష్ట్రంలోని 64.70 లక్షల మందికి పైగా ఉన్న ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్‌ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించారన్నారు. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8నుంచి 10నెలల వరకు ఉపాధి దొరుకుతుందన్నారు. నేతన్న పొదుపు పథకం కింద జిల్లాలోని 212 చేనేత, అనుబంధ కార్మికులను నమోదు చేశామని, కార్మికుల వాటా కింద రూ 1.50 లక్షలు, ప్రభుత్వ వాటా కింద రూ 3 లక్షలు ప్రతినెలా జమ చేస్తామన్నారు. జిల్లాలో 5137 మంది మరమగ్గాల, అనుబంధ కార్మికులకు బీమా చేయించామని, ఇప్పటివరకు 77మంది కార్మికులు మరణించగా, వారి కుటుంబాలకు రూ5 లక్షల చొప్పున రూ3.55 కోట్లను నామినీ బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లాలోని ఆరు చేనేత సహకార సంఘాలకు క్యాష్‌ క్రెడిట్‌ పథకం కింద ప్రతి ఏడాది రూ 45లక్షలు మంజూరుచేస్తామని, త్రిఫ్ట్‌ పథకం కింద జిల్లాలోని 4963 మంది మరమగ్గాల, అనుబంధ కార్మికులు నమోదు అయ్యారని, రూ.12.40 కోట్లు ప్రభుత్వ వాటా కింద విడుదల చేశామన్నారు. మరమగ్గాల ఆసాములు, కార్మికులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వేములవాడలో రూ 50కోట్ల కార్పస్‌ ఫండ్‌తో విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లకు 90శాతం క్రెడిట్‌ ద్వారా యారన్‌ అందిస్తామని తెలిపారు.

నూతనంగా 14075 రేషన్‌ కార్డులు పంపిణీ

జిల్లాలో కొత్తగా 14075 రేషన్‌ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, 30376 మంది కుటుంబ సభ్యులు పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డుల్లో చేర్చామన్నారు. అర్హులకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయడం నిరంతరం జరుగుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ఉపయోగపడుతుందన్నారు.

సాగుకు ఊపిరి.. వేగంగా పనులు

జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను ప్రభుత్వం పూర్తి చేయిస్తోందని శ్రీని వాస్‌ అన్నారు. మల్కపేట రిజర్వాయర్‌ ప్యాకేజ్‌- 9 కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశామని, వేములవాడ నియోజకవర్గంలోని 12 గ్రామా లకు సాగునీరు అందుతుందన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ స్టేజీ-2 ఫేస్‌-1లోని రుద్రంగి చెరువు (కలికోట సూరమ్మ) పనులు శరవేగంతో కొనసాగుతున్నాయన్నారు. రుద్రంగి చెరువు అలుగు నిర్మాణ పనులు పూర్తికాగా, మట్టి కట్ట, తూముల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయ న్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 393 మంది రైతుల కుటుంబాలకు రూ 18 కోట్లు భీమా కింద పంపిణీ చేశామని అన్నారు. రైతు భరోసా కింద 126278 మంది రైతులకు రూ 149.27 కోట్లు పంపిణీ చేశామని, రూ 381.45 కోట్ల రుణ మాఫీ చేశామని అన్నారు.

రూ.200 కోట్లతో ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌

వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ రెసి డెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ మంజూరుచేస్తూ పభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పేద బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి రానుందన్నారు. జిల్లాలోని 486 ప్రభుత్వ పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్‌ సౌకర్యం కల్పిస్తూ డిజిటల్‌ మాధ్యమంలో బోధనను అందిస్తున్నట్లు, రుద్రంగి మండల కేంద్రంలో రూ 42కోట్లతో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ మంజూరు చేశామన్నారు. తం గళ్ళపల్లి మండలం మండేపల్లి వద్ద అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రారం భంకాగా, ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయని. అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. జిల్లాలో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధుల కింద 730 పనులకు రూ.50.29 కోట్లు మంజూరుకాగా, 443 పనులు పూర్తి చేశామన్నారు. జాతీయ ఆరోగ్య మిషిన్‌ కింద మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులకు రూ 4.45 కోట్లు, 16 ఉప కేంద్రాల నిర్మాణానికి రూ.3.20 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రెండు పూర్తి కాగా, ఒకటి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.

జిల్లాలో మానాల-మర్రిమడ్ల బీటీరోడ్డు రూ.10కోట్ల నిధులతో నిర్మాణం జరుగుతోందని, 18 వంతెనల పనులు మొదలుపెట్టి 13 పనులు పూర్తి చేశామని, మిగతావి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్లలో కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి రూ 81 కోట్లు మంజూరయ్యాయని, ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి గృహముల నిర్మాణానికి రూ 166 కోట్లు మంజూరుకాగా, వాటి నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నట్లు తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో టూడీఎకో సేవలను ప్రారంభించామ ని, 10 బెడ్లతో పాలేటివ్‌ కేర్‌ విభాగం ఏర్పాటు చేసి, చివరి దశలో ఉన్న రోగులకు వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కా యకల్పఅవార్డ్‌కు వేములవాడ ఏరియా ఆసుపత్రి ఎంపికైనట్లు తెలిపారు.

వేములవాడ పట్టణంలోని పట్టణంలో వర్షం నీరు ముంచెత్తకుండా రూ 3. కోట్ల నిధులతో పైప్‌ లైన్‌ నిర్మించడం జరుగుతున్నట్లు తెలిపారు. రూ 6కోట్లతో వేములవాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం మురుగునీరు మూ లవాగు, గుడి చెరువులో కలువకుండా ప్రత్యేక కార్యాచరణతో డైవర్షన్‌ పనులు మొదలై.. పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్ల మున్సిపాలి టీలో రూ 3కోట్ల 10లక్షలతో రగుడు జంక్షన్‌ అభివృద్ధి పనులు జరుగుతు న్నాయని, రూ.50 లక్షలతో వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డైన్రేజీ నిర్మాణాలు పూర్తి చేశామని, రూ 15 కోట్లతో సిరిసిల్ల కొత్త చెరువు మత్తడి నుంచి శ్రీనగర్‌ కాలనీ, బైపాస్‌ రోడ్డు మీదుగా వరద కాలువ నిర్మాణానికి, అలా గే రూ. 2 కోట్ల 50 లక్షలతో సిరిసిల్ల పాత బస్టాండ్‌ లోని సంజీవయ్య కమాన్‌ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అమృత్‌ 2.0 కింద రూ104 కోట్లతో పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ఐదెకరాల స్థలం మానేరు వద్ద బతుకమ్మ ఘాట్‌ సమీపంలో కేటాయించామని, చందుర్తి మండలం మూడపల్లిలో క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి ఆరెకరాల స్థలం కేటాయించినట్లు తెలిపా రు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం కల్పించిం దన్నారు. జిల్లాలోని పలుచోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, వీర్నపల్లిలో పోలీస్‌స్టేషన్‌ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశామ న్నా రు. అదనపు కలెక్టర్‌ నగేష్‌, అదనపు ఎస్పీ సురేష్‌, ఆర్డీవోలు వెంకటేశ్వ ర్లు, రాధాబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయ ణ, సెస్‌ చైర్మన్‌ చిక్కల రామారావు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక వేడుకలు

స్వాతంత్య్ర సంబరాలను జిల్లాలో త్రివర్ణశోభితంగా నిర్వహించుకున్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలను ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌ జాతీయ పతాకవిష్కరణతో ప్రారంభించారు. దేశభక్తిని చాటుతూ చిన్నారుల నృత్యాలు అందరిని అలరించాయి. వివిధ శాఖలుప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్టాళ్లను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌ బీ గీతేలు స్టాళ్లను సందర్శించారు. మహిళలకు కుట్టు మిషన్లు పంపణీ చేశారు.

Updated Date - Aug 16 , 2025 | 01:06 AM