Share News

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:38 AM

సైబర్‌ నేరాలపై పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. శనివారం హుజూరాబాద్‌ ఏసీపీ కార్యాలయాన్ని, పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్‌జీ, టౌన్‌ సీఐ తిరుమల్‌గౌడ్‌లు పూల మొక్కను అందించారు.

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

హుజూరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాలపై పోలీస్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. శనివారం హుజూరాబాద్‌ ఏసీపీ కార్యాలయాన్ని, పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్‌జీ, టౌన్‌ సీఐ తిరుమల్‌గౌడ్‌లు పూల మొక్కను అందించారు. ఈ మేరకు పెండింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించి, త్వరిగతిన పూర్తి చేయాలని సూచించారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. పోలీస్‌ సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని తెలిపారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలపై పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని త్వరగా పూర్తి చేయాలన్నారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌ హోల్స్‌గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పీడీఎస్‌ బియ్యం, పేకాట స్థావరాలను గుర్తించి, ఆడేవారిని పట్టుకొని, తగిన కేసులు నమోదు చేసి వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు. అలాగే రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:38 AM