Share News

అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:18 AM

రాష్ట్రంలో అభివృద్ధి, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన కొనసాగు తున్నదని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేం దుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు కృషి చేస్తున్నారని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఓబేదుల్లా కోత్వాల్‌ సాహెబ్‌ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహిం చిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

 అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన
జాతీయ పతాకానికి సెల్యూట్‌ చేస్తున్న రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌

- దశల వారీగా అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు

- జిల్లాలో కొత్తగా 12,168 కుటుంబాలకు రేషన్‌ కార్డుల జారీ

- పత్తిపాక రిజర్వాయర్‌ నిర్మాణానికి డీపీఆర్‌ తయారీకి కృషి

- ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి

- తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఓబేదుల్లా కోత్వాల్‌ సాహెబ్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రాష్ట్రంలో అభివృద్ధి, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన కొనసాగు తున్నదని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేం దుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు కృషి చేస్తున్నారని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఓబేదుల్లా కోత్వాల్‌ సాహెబ్‌ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహిం చిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీ సుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సంద ర్భంగా కొత్వాల్‌ సాహెబ్‌ జిల్లా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, 500 రూపా యలకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యు త్‌ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మని అన్నారు. పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన రేషన్‌ కార్డులను అర్హులైన పేద కుటుంబాల అందరికీ మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో కొత్తగా 12,168 కుటుంబాలకు రేషన్‌కార్డులను జారీ చేశామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.

ఫ ఉగాది నుంచి సన్న బియ్యం..

ప్రజా పంపిణీ ద్వారా ఇస్తున్న దొడ్డు రకం రేషన్‌ బియ్యాన్ని ప్రజలు తినకుండా, పక్కదారి పట్టిస్తున్నా రని భావించిన ప్రజా ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపేందుకు ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందన్నారు. కాకతీయ కాలువ కింద ఉన్న 2 లక్షల 30 వేల ఆయకట్టు స్థిరీకరణ, 10 వేల ఎక రాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు శ్రీలక్ష్మీ నరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్‌ను 3 నుంచి 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి డీపీఆర్‌ తయారీకి కోటి 10 లక్షల రూపాయల మంజూరు చేశామన్నారు. 13,396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పథకం పెండింగ్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నీటి పారు దల శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించామని తెలిపారు.

ఫ ఆసుపత్రుల అభివృద్ధికి కోట్ల నిధులు..

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల అప్‌గ్రేడ్‌ చేసి కార్పొ రేట్‌కు దీటుగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేసింద న్నారు. గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రి 160 కోట్లతో నిర్మాణం జరుగుతుందన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 173 కోట్లు ఖర్చు చేస్తూ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, బీటీ రోడ్లు, శ్మశాన వాటికలు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, పురపాలక భవనం, డంప్‌ యార్డ్‌ వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. 23 కోట్ల 75 లక్షలతో గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూని ట్‌, 51 కోట్లతో పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రి, 22 కోట్లతో మంథనిలో 50 పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో సామాజిక తెలం గాణ సాధనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహమ్మద్‌ ఓబేదుల్లా కోత్వాల్‌ సాహెబ్‌ అన్నారు. జిల్లా అభివృద్ధికి, పేదల సంక్షేమా నికి కృషి చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, డి వేణు, డీసీపీ కరుణాకర్‌, ఆర్‌డీఓ గంగయ్య, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మార్కెట్‌ కమిటీల చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాశ్‌ రావు, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:18 AM