Share News

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:59 PM

ప్రజాపాలన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి.

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజాపాలన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ జాతీయ జెండాను ఎగర వేశారు. అనంతరం పాత బస్టాండ్‌ సమీపంలోని తెలంగాణ అమరవీ రుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. గ్రంథాలయం జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, డైరెక్టర్లు దుబాల వెంకటేశం, కాసర్ల రాజు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, టీసీసీసీ కోఆర్డినేటర్‌ సంగీతం శ్రీనివాస్‌, మహిళ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కామని వనిత, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల క్రైం : ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జాతీయ పతాకాన్ని ఎస్పీ మహేష్‌ బి. గీతే ఎగురవేశారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈవో రమాదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఉద్యోగులు శ్రావణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, అశోక్‌, జయకుమారి, బొడుసు మహేష్‌, వంశీ, ఎడ్ల శివసాయి ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు.

ఇల్లంతకుంట : మండలంలో ప్రజాపాలన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేకాధికారి రామకృష్ణ, డీటీ సత్యనారాయణ, సురేష్‌రెడ్డి, దేవరాజం, ఎంపీడీవో శశికళ, ఎంపీవో శ్రీనివాస్‌ అధికారులు పాల్గొన్నారు.

కోనరావుపేట : మండలంలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరు పుకున్నారు. జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు.

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : ప్రజా పాలన దినోత్సవం.. తెలంగాణ జాతీయ సమైక్యత, విమోచన వేడుకలు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండ లాల్లో బుధవారం ఘనంగా జరిగాయి. తహసీల్దార్లు సుజాత, ముక్తర్‌పాషా, ఎంపీడీవోలు సత్తయ్య, బీరయ్య, ప్యాక్స్‌ చైర్మన్లు కృష్ణారెడ్డి, సుధీర్‌రావు, సీఐ శ్రీనివాస్‌గౌడ్‌, ఎస్‌ఐలు రాహుల్‌రెడ్డి, మోతీరాం, లక్ష్మణ్‌, ఎక్సై జ్‌ సీఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి : మండలంలో ప్రజాపాలన వేడుకులను జరుపుకు న్నారు. మండల ప్రత్యేకాధికారి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ జయం త్‌ కుమార్‌, బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావు, సిరిసిల్ల, నేరెళ్ల ప్యాక్స్‌ చైర్మన్లు బండి దేవదాస్‌, కొడూరి భాస్కర్‌గౌడ్‌, ఎంపీడీవో లక్ష్మీనారయణ, ఎంపీవో మీర్జా తదితరులు పాల్గొన్నారు.

ముస్తాబాద్‌ : మండల కేంద్రంలో ప్రజా పాలన వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్‌ రాంచంద్రం, ఎంపీడీవో లచ్చాలు, ఎస్సై గణేశ్‌, ఏఎంసీ ఛైర్మన్‌ తలారి రాణినర్సయ్య, కాంగ్రెస్‌ మండల, పట్టణ అధ్యక్షులు యెల్ల బాల్‌రెడ్డి, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీనివాస్‌, ఎదునూరి భాను, మిరుదొడ్డి భాను, రంజాని నరేశ్‌, కొమురయ్య, గాంత రాజు, శీల ప్రశాంత్‌,తాళ్ల విజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు హమీద్‌, ఏఎంసీ డైరెక్టర్‌ ప్రభాకర్‌, ప్యాక్స్‌ డైరెక్టర్‌ రాజవీర్‌, గౌరి శంకర్‌, నాంపెల్లి, శేఖర్‌, ప్రవీన్‌, భాస్కర్‌, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

వేములవాడ రూరల్‌ : మండలంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడివో శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రొండి రాజు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

బోయినపల్లి : మండలంలో ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారు లు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో జయాశీల, డిప్యూటీ తహసీల్దార్‌ భుపేష్‌, సెస్‌ డైరెక్టర్‌ కొట్టేపల్లి సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ బోయిని ఎల్లేశ్‌, యాదవ్‌, వైస్‌చైర్మన్‌ నిమ్మ వినోద్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వెన్నెల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి : మండల కేంద్రంలో ప్రజాపాలన వేడుకలను నిర్వహిం చారు. తహసీల్దార్‌ భూపతి, ఎంపీడీవో రాధా, ఎస్సై రమేష్‌, ఎంఏవో అనూష, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు చింతపటి రామస్వామి, బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:59 PM