Share News

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:29 AM

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సూచించా రు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సూచించా రు. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి, వెంకటాపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులకు పలు సూచించారు. పోతిరెడ్డిపల్లిలో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాకు పలువురు గ్రామసులు మోరీలు లేక దోమలు, ఈగల వల్ల జ్వరాలు వస్తున్నాయని విన్నవించారు. మురుగు నీటి కాల్వలను నిర్మించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సును నడిపించేలా చూడాలని ఆర్టీసీ డీఎంను ఆదేశించారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగం, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:29 AM