Share News

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

ABN , Publish Date - May 03 , 2025 | 12:09 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అధ్యాపకులకు సూచించారు. శుక్రవారం నియోజకవర్గం లోని జూనియర్‌ కళశాల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారివారి కేంద్రాల్లో వచ్చిన ఫలితాలను తెలుసుకోని అసం తృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
అధ్యాపకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌

- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌

కోరుట్ల, మే 2 (ఆంధ్రజ్యో తి): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అధ్యాపకులకు సూచించారు. శుక్రవారం నియోజకవర్గం లోని జూనియర్‌ కళశాల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారివారి కేంద్రాల్లో వచ్చిన ఫలితాలను తెలుసుకోని అసం తృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ మాట్లాడారు. పరీక్ష ఫలితాల్లో అనుకున్న స్థాయిలో ఉతీర్ణత సాదించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో నిష్ణా తులైన అధ్యాపకులు ఉన్నా విద్యార్థులు వెనుకబడి పోయడానికి కారణాలను అన్వేషించాలని సూచిం చారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా అధ్యాపకులు కృషిచేయాలని ఆదేశించారు. మల్లాపూర్‌ మండలానికి చెందిన ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో కేవలం 5 శాతం ఉతీర్ణత శాతం రావడం బాఽధాకరమని విద్యార్థుల వెనుకబాటుకు అధ్యాపకుల పనితీరు నిదర్శనంగా నిలుస్తుందని అగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలా లకు చెందిన జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్స్‌, ఉపన్యాసకులు పాల్గొన్నారు.

మల్లాపూర్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): అధికారులు నిబంధనలకు అనుగు ణంగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలు అందించాలని కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ సూచించారు. శుక్రవారం మల్లాపూర్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యలయం లో ఎంపీడీవో ఆధ్వర్యంలో అధికా రుల సమీక్ష సమావేశన్ని నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదుతువున్న విద్యార్థులకు నాణ్య మైన విద్యాబోధన అందించాలని సూచించారు. ఇటివల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో మల్లాపూర్‌ మోడల్‌ పాఠశాల, కళాశాలకు వచ్చిన ఫలితాలు అసంతృప్తింగా ఉన్నయని, విద్యార్థుల పట్ల ప్రత్యేకశ్రద్ధ చూ పాలన్నారు. మండలంలోని అధికారులు అభివృద్ధి పనులు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా పారదర్శకంగా పనిచేయాలని సూ చించారు. కార్యక్రమంలో మండలంలోని అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:09 AM