Share News

అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:39 AM

వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ సూచించారు.

అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి

ఇల్లంతకుంట, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ సూచించారు. మండలకేంద్రంలోని పల్లె దవాఖానాను శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం మందుల స్టోర్‌రూం, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Updated Date - Dec 14 , 2025 | 12:39 AM