బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:31 AM
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వర్యం ప్రాజెక్టు కమిషన్‌పై విచారణ కోరుతూ సీబీఐకి ఇవ్వడాన్ని వ్య తిరేకిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రం అం బేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నాను చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వర్యం ప్రాజెక్టు కమిషన్‌పై విచారణ కోరుతూ సీబీఐకి ఇవ్వడాన్ని వ్య తిరేకిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రం అం బేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నాను చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్‌ఎస్ నాయ కులు, మాజీ ప్రజాప్రతినిధులు రోడ్డుపై బైఠాయించి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, నాయకుడు చీటి నర్సింగరావు, ఎండీ సత్తార్, బత్తుల వనజ, దార్నం లక్ష్మినారాయణ, అడగట్ల మురళి, బుర్ర రాజు, ఆకునూరి శంకరయ్య, వెంగళ శ్రీనివాస్, సుంకపాక మనోజ్, సబ్బని హ రీష్, దార్ల సందీప్, అన్నారపు శ్రీనివాస్, కల్లూరి రాజు, గెంట్యాల శ్రీని వాస్, బొల్లి రామ్మోహన్, కల్లూరి మధు, అడిచెర్ల సాయి, శ్రీనివాస్‌రావు, గడ్డం భాస్కర్, అక్రమ్, గుండ్లపెల్లి శ్రీనివాస్, చంద్రయ్య, చాంద్‌పాషా, పాటి కుమార్‌రాజు, కత్తెర వరుణ్, రాపెల్లి ప్రవీన్ పాల్గొన్నారు.