Share News

13న కలెక్టరేట్‌ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:41 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి బీఆర్‌ గవాయ్‌పై దాడిని ఖండిస్తూ ఈనెల 13న కలెక్టరేట్‌ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి పుట్ట మధు అన్నారు.

13న కలెక్టరేట్‌ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి బీఆర్‌ గవాయ్‌పై దాడిని ఖండిస్తూ ఈనెల 13న కలెక్టరేట్‌ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి పుట్ట మధు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎంఆర్‌పీఎస్‌, ఎంఎస్‌పీ, వీహెచ్‌పీఎస్‌ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తిపై జరిగిన దాడిని దేశ న్యాయవ్యస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామ న్నారు. ప్రధాన న్యాయమూర్తిపై దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్‌ కిషోర్‌ పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 13న జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన, అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, 22న చలో హైదరాబాద్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆవునూ రి ప్రభాకర్‌, ఎలగందుల బిక్షపతి, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మ ణ్‌, వీహెచ్‌పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ శోభారాణి, కోకన్వీనర్‌ పురుషోత్తం, కత్తెరపాక రవీందర్‌, ఎమ్మార్పీఎస్‌ పట్టణ అధ్యక్షుడు బడుగు లింగయ్య, సీనియర్‌ నాయ కుడు ఆవునూరి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:41 AM